ETV Bharat / sitara

ఆ హీరోయిన్​తో ఎప్పటికీ నటించనన్న సల్మాన్​ఖాన్​! - raveena tandon salman khan

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​, తాను(raveena tandon and salman khan) ఎప్పుడూ తగాదా పడేవారని గతాన్ని గుర్తుచేసుకుంది నటి రవీనా టాండన్​. తామిద్దరిదీ చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పింది. దీంతో పాటే తన ఫేవరెట్​ కోస్టార్స్​ పేర్లను వెల్లడించింది.

salman khan
సల్మాన్​ ఖాన్​
author img

By

Published : Oct 28, 2021, 7:12 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ఖాన్​, తాను(raveena tandon salman khan movie) ఎప్పుడూ గొడవపడేవారని గుర్తుచేసుకుంది నటి​ రవీనా టాండన్​. వీరిద్దరూ జంటగా కలిసి నటించిన తొలి సినిమా 'పత్తర్​ కే ఫూల్'(raveena tandon salman khan). దర్శకుడు అనంత్​ బలానీ తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. ఆ మూవీ షూటింగ్​ సమయంలోని తన అనుభవాలను తెలుపుతూ సల్మాన్​తో తనకున్న అనుబంధం గురించి చెప్పింది.

salman
సల్మాన్​ రవీనా టాండన్​

"నా తొలి సినిమా సమయానికి నా వయసు 16ఏళ్లు, సల్మాన్​ వయసు 23. సినిమా షూటింగ్​ సమయంలో చిన్న పిల్లల్లా ప్రతి విషయానికి గొడవ పడేవాళ్లం. మా ఇద్దరిదీ ఒకే మనస్తత్వం. సల్మాన్​ తండ్రి సలీమ్​, మా నాన్న కలిసి పనిచేసేవారు. అలా చిన్నప్పటి నుంచే అతను నాకు తెలుసు. కలిసి పెరిగాం. అప్పట్నుంచే మాకు పడేది కాదు. షూటింగ్​లలోనూ తగాదా పడేవాళ్లం. దాంతో ఎప్పటికీ నాతో సినిమా చేయనని సల్మాన్​ అనేవాడు. కానీ ఆ తర్వాత మా కాంబినేషన్​లో కామెడీ క్లాసిక్​ చిత్రాలు 'అందాజ్​ అప్నా అప్నా', 'కహీ ప్యార్​ నా హోజాయే' విడుదలై ఆకట్టుకున్నాయి."

-రవీనా టాండన్​, నటి.

దీంతోపాటే హీరోలందరూ తన ఫేవరెట్​ కోస్టార్స్​ అని చెప్పింది రవీనా టాండన్​. బీటౌన్​ నటులు సల్మాన్​ ఖాన్​తో సహా సంజయ్​ దత్​, సునీల్​, జగ్గు, గోవిందా తన బడ్డీస్​ అని చెప్పింది(raveenatandon movies).

బాలీవుడ్​తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి రవీనా టాండన్​. 'పత్తర్​ కే ఫూల్​'తోనే ఆమె వెండితెర అరంగేట్రం చేసింది. వచ్చే ఏడాదిలో కన్నడ స్టార్​ యశ్​ నటించిన 'కేజీఎఫ్​ 2'తో(raveena tandon kgf 2 role) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తాను ప్రధాన మంత్రి పాత్ర పోషించింది(raveena tandon kgf look). దీంతో పాటు నెట్​ఫ్లిక్​ రూపొందిస్తున్న 'Aranyak' వెబ్​సిరీస్​లో నటిస్తోంది.

raveena tandon
'కేజీఎప్​ 2'లో రవీనా టాండన్​

ఇదీ చూడండి: హిట్​ కొట్టినా ఛాన్సే రాలేదు.. చాలా బాధపడ్డా: సల్మాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.