బాలీవుడ్ చిత్రసీమలో ప్రేమలు, స్నేహాలు ఎప్పుడు పుడతాయో, ఎలా ముగుస్తాయో అంత ఈజీగా అర్థం కాదు. అలాంటి జాబితాలో సోనాక్షి సిన్హా - అర్జున్ కపూర్‌ల పేర్లు కూడా ఉన్నాయి. గతంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. 2015 'తేవర్' చిత్రంలో ఈ జంట కలిసి నటించింది. ఈ సినిమా తెలుగులో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన 'ఒక్కడు' రీమేక్. అర్జున్ కబడ్డీ ప్లేయర్‌గా నటించాడు. ఆ మూవీ సమయంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టిందట. అయితే అది కొంతకాలనికే పరిమితమైంది. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రేమ విషయమై అర్జున్ కపూర్ తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు.
"కొన్ని పరిచయాలు తొందరగా చెంతచేరి అంతలోనే దూరమౌతాయి. మరికొన్ని పరిచయాలు చాలాకాలంగా అట్టే కొనసాగుతుంటాయి. అయినా స్నేహితురాలిగా ఇప్పటికీ సోనాక్షి అంటే ఇష్టమే. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఇద్దరం తారసపడితే బాగానే మాట్లాడుకుంటాం. మా ఇద్దరిపై ఎలాంటి ఒత్తిడి లేదు."
-అర్జున్ కపూర్, కథానాయకుడు
ప్రస్తుతం అర్జున్ కపూర్, నటి మలైకా అరోరాతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. 'దబంగ్' నటి సోనాక్షి సిన్హా తన సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆమె ప్రస్తుతం ఓ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ కపూర్ మొదట సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్‌తో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నాడట. ఆ తర్వాత అతియా శెట్టితోనూ ప్రేమ వ్యవహారం సాగించినట్లు అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి. ప్రస్తుతం అర్జున్, దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో 'సందీప్ ఔర్ పింకీ పరార్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో పరిణీతి చోప్రా కథానాయికగా కనిపించనుంది.
ఇదీ చూడండి.. 'ఫుడ్, బెడ్ బాగుందని పక్కింటికి వెళతావా..?'