ETV Bharat / sitara

20 నిమిషాల్లో ఆ పాట కంపోజ్​ చేసిన సరోజ్​ ఖాన్​ - Saroj Khan choreographed iconic Ek do teen track in 20 minutes

దిగ్గజ కొరియోగ్రాఫర్​ సరోజ్​ ఖాన్​ త్రోబ్యాక్​ వీడియోను పంచుకుంది నటి మాధురి దీక్షిత్​. ఇందులో మాట్లాడిన ఈ నృత దర్శకురాలు.. తమ కాంబోలో వచ్చిన ఓ సూపర్​హిట్ గీతాన్ని​ కేవలం 20 నిమిషాల్లోనే కొరియోగ్రఫీ చేసినట్లు తెలిపారు​.

madhuri
మాధురీ
author img

By

Published : Jul 5, 2020, 6:50 PM IST

Updated : Jul 5, 2020, 11:00 PM IST

బాలీవుడ్​ దిగ్గజ కొరియోగ్రాఫర్​ సరోజ్​ ఖాన్, జులై 3న గుండెపోటుతో మరణించారు. అప్పటినుంచి పలువురు సెలబ్రిటీలు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. దీంతోపాటు ఆమెతో తమకనున్న మధుర స్మృతులను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంతాపం తెలిపిన నటి​ మాధురి దీక్షిత్.. త్రో బ్యాక్​ వీడియో పోస్ట్ చేయడం సహా భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు.

  • Every conversation with Saroj ji was full of knowledge, inspiration and energy. That's how she lived life and that is how I will always remember her ♥️ pic.twitter.com/fzOPg2FU9N

    — Madhuri Dixit Nene (@MadhuriDixit) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నాకు ఎన్నో సందర్భాల్లో సరోజ్​ స్ఫూర్తిగా నిలిచారు. ఎంతో శక్తి సామర్థ్యాలు, జ్ఞానాన్ని అందించారు. ఎప్పటికీ నా మదిలో ఆమె స్థానం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎంతోగానో ఆమెను మిస్​ అవుతున్నా" అంటూ మాధురి వ్యాఖ్య జోడించింది.

ఈ వీడియోలో భాగంగా మాధురి, సరోజ్​ఖాన్.. ఐకానిక్​​ సాంగ్​ 'ఏక్​ దో తీన్'​ గురించి సంభాషిస్తూనే ముఖకవళికలతో డ్యాన్స్​ వేశారు. ఈ పాటను ఎలా నృత్య దర్శకత్వం వహించారో అందుకు సంబంధించిన పలు విషయాలను చెప్పారు సరోజ్​. కేవలం 20 నిమిషాల్లోనే ఈ పాట కొరియోగ్రాఫీ పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటికీ ఉర్రూతలూగిస్తున్నాయి

సరోజ్​ ఖాన్​.. తన కెరీర్​ మొత్తంలో 2వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. 'డోలా రే డోలా', 'ఏక్​ దో తీన్'​, 'యే ఇష్క్​ హాయే' వంటి ప్రసిద్ధ పాటలకుగానూ మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు.

గతంలో మాధురి దీక్షిత్‌- సరోజ్‌ఖాన్‌ కాంబోలే వచ్చిన అనేక పాటలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 'చోలీకే పీచే క్యా హై' అనే పాట ఇప్పటికీ శ్రోతలను ఊర్రూతలూగిస్తుండటం విశేషం. ఇటీవలే కంగన 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ', మాధురి దీక్షిత్ 'కలంక్'లో పాటలకు దర్శకత్వం వహించారు సరోజ్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చూడండి : దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇక లేరు

Last Updated : Jul 5, 2020, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.