కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు నటుడు అల్లు శిరీష్(Allu sirish). వర్కౌట్స్ ఎలా చేయాలి, ఫిట్‌గా ఎలా ఉండాలి అనే విషయంపై ఇప్పుడీ హీరో అందరికీ తన వీడియోల ద్వారా మోటివేషన్ ఇస్తున్నారు. ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది. ఈ డిజిటల్ సిరీస్‌లో కేవలం జిమ్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా యోగా, బాక్సింగ్‌కు సంబంధించిన విషయాలు కూడా చూపించబోతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం అల్లు శిరీష్.. 'ప్రేమ కాదంట'(prema kadhanta) సినిమాలో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ నిర్మిస్తోంది.
ఇదీ చూడండి: శిరీష్, అను కెమిస్ట్రీ మామూలుగా లేదుగా!