ETV Bharat / sitara

కీరవాణి నోట కరోనా పాట... నెట్టింట వైరల్​

author img

By

Published : Apr 3, 2020, 7:44 AM IST

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు తమ వంతు ప్రచారాన్ని చేస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఎమ్​ఎమ్​ కీరవాణి కరోనాపై ఓ గీతాన్ని రూపొందించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

Washing hand poem sing by Keeravani
కరోనా తగ్గిపోయాక కూడా చేతులు కడుక్కోవల్సిందే!

కరోనాతో సాగుతున్న యుద్ధంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇంట్లో గడుపుతూ ఆ యుద్ధానికి సహకరించాల్సిన జనం మాత్రం, బయటికెళ్లి శత్రువుకి మరింత బలాన్నిస్తున్నారు. ఇది తగదంటూ జనంలో చైతన్యం పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ‘ఓ మై డియర్‌ గర్ల్స్‌, డియర్‌ బాయ్స్‌...’ అంటూ కరోనా నేపథ్యంలో ఓ పాటని రూపొందించారు. ఆ పాట ప్రజలకి జాగ్రత్తలు సూచిస్తూనే, సేవ చేస్తున్న వాళ్లకి కృతజ్ఞతలు చెబుతూ సాగుతోంది. ఆ పాట గురించి కీరవాణి ‘ఈనాడు సినిమా’తో చెప్పిన విషయాలివీ...

లాక్‌డౌన్‌ సమయంలో మీ జీవితం ఎలా గడుస్తోంది?

ఇప్పటిదాకా అయితే బాగానే గడుస్తోంది. నిర్బంధం మూడు వారాలే కదా. బయటికి వెళ్లకూడదంటే వెళ్లకూడదంతే. మూడు వారాలు పని మాని ఇంట్లో కూర్చుంటే పోయేదేముంది? కుటుంబంతో కాలక్షేపం చేస్తే బాగుంటుంది.

‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ పాట బాణీలోనే కరోనా గీతం చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది?

పేషంట్‌ అంటే రెండు అర్థాలున్నాయి. ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రోగి అని ఒక అర్థం. సహనంతో నిరీక్షించే వ్యక్తి అని మరో అర్థం. సహనం కోల్పోయి బయటికి వెళ్లి తిరిగితే అప్పుడు కరోనా పాజిటివ్‌ వచ్చి ఆ ఇంట్లో పేషంట్‌ నెంబర్‌ 1 అనిపించుకుంటారు. అదే ఇళ్లల్లోనే ఉంటూ ఈ పరీక్షలో నెగ్గారనుకోండి. అప్పుడూ పేషంట్‌ నెంబర్‌ 1 అంటారు. మీరు ఏ రకమైన నెంబర్‌ 1 కావాలనుకుంటున్నారు? ఈ ఆలోచన రాగానే నాకు ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ గుర్తుకొచ్చింది. అందులో బాణీనే తీసుకొని ఈపాట తయారు చేశా.

కరోనా రోగుల సంఖ్య పెరిగేకొద్దీ జనాల్లో భయం పెరుగుతోంది. దాని గురించి మీరేం చెబుతారు?

భయం ఎందుకండీ? 1991లో హెపటైటిస్‌-బి వచ్చినప్పుడు లక్షల్లో చనిపోయారని నాకు శాంతా బయోటెక్‌ వరప్రసాద్‌రెడ్డి గారు చెప్పారు. కాకపోతే అప్పట్లో మీడియా ఇంతగా లేదు. మిగతా దేశాలతో పోలిస్తే కరోనాతో మన దేశంలో తక్కువ మందే పోయారు. మరింత అవగాహనతో ఇంట్లోనే కూర్చుని, కరోనా వ్యాప్తిని అరికడితే ఈ నష్టం ఉండదు. ప్రపంచంలోనే మనది ఉత్తమ దేశం అని గుర్తించడానికి గొప్ప అవకాశం ఇది.

కరోనా లాంటి వైపరీత్యాలు మనిషిలోని స్వార్థంతోనే వస్తాయంటారా?

పెరుగుట విరుగుట కొరకే అని మాత్రమే నేను అంటాను. ఇవి ఎందుకు జరుగుతున్నాయో చెప్పాల్సింది వైద్యులు, శాస్త్రవేత్తలు. వాళ్లు చెబుతూనే ఉన్నారు. మనం పట్టించుకోం కాబట్టి ఇలా ఒకేసారి అన్నీ మీదకొస్తాయి. కరోనా తగ్గిపోయినా దేశంలో అందరూ చేతులు కడుక్కోవల్సిందే. రోజూ స్నానంలాగే చేతులు శుభ్రం చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. కరోనా లేదంటే మరో వైరస్‌ ఏదో ఉంటుంది కదా.

ఈ విరామంలో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయా?

ఇప్పుడు ఆ పనులేమీ జరగడం లేదు. ఇటీవల విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు వీడియోకు ఎన్టీఆర్‌తో ఆన్‌లైన్‌లో డబ్బింగ్‌ చెప్పించాం. ఎన్టీఆర్‌ డైలాగ్‌ డెలివరీ బాగుంటుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చని రాజమౌళి ఆయనతోనే నాలుగు భాషల్లో డబ్బింగ్‌ చెప్పించారు.

సోషల్‌ డిస్టెన్సింగ్‌ అంటారు కానీ... మనం ఇంట్లో కూర్చునే సామాజికంగా ఇంకా దగ్గరగా ఉండొచ్చు. బోలెడు సమయం దొరికింది కాబట్టి ఎవరికైనా ఫోన్‌ చేసి మాట్లాడొచ్చు. అది సోషల్‌గా దగ్గరగా ఉండడమే. ఎప్పట్నుంచో సారీ చెప్పాలి, థ్యాంక్స్‌ చెప్పాలి, ఇంకేదో అడగాలనే ఆలోచనలో ఉంటాం. అవన్నీ ఇప్పుడు ఫోన్‌లో చేయొచ్చు. ఫోన్‌లో వీడియో కాల్‌ చేసి మాట్లాడుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలతో ఇప్పటి వరకు చేయని పనులు చక్కబెట్టుకోవచ్చు’’.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

(‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ సినిమాలో ‘ఎక్కడో పుట్టి...’ పాట వరసలో)

ఓ మై డియర్‌ గర్ల్స్‌.. డియర్‌ బాయ్స్‌

డియర్‌ మేడమ్స్‌... భారతీయులారా...

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి

ఇక్కడే చేరింది... మహమ్మారి రోగమొక్కటి

ఎక్కడివాళ్లు అక్కడే ఉండి ఉక్కు సంకల్పంతో

తరుముదాము దాన్ని బయటికి

వియ్‌ విల్‌ స్టే ఎట్‌ హోమ్‌ ।। 2 ।।

వియ్‌ స్టే సేఫ్‌

ఉత్తుత్తి వార్తలు పుకారులన్నీ నమ్మకండి

అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి

విందులు పెళ్లిళ్లు వినోదాలు కాస్త మానుకోండి

బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి

కాస్తయినా వ్యాయామం రోజూ చెయ్యండి

కూస్తయినా వేణ్నీళ్లు తాగుతుండండి

అనుమానం వచ్చిన ప్రతిసారీ

వెనువెంటనే చేతులని కడుగుతుండండీ

ఇల్లు ఒళ్లు మనసు శుభ్రపరుచుకుంటే

ఇళ్లలోనే ఆ స్వర్గాన్ని చూడొచ్చండీ...

ఇష్ట దేవతలని కాస్త తలచుకుంటే

యే కష్టమైన అవలీలగా దాటొచ్చండీ

సొంత ప్రాణాలను పణంగా

పెట్టిన త్యాగమూర్తులు

మనలోనే ఉన్నారు,

మనుషుల్లో దేవుళ్లు డాక్టర్లు నర్సులు

కనబడని శత్రువుతో పోరాటం

చేస్తున్న సమరయోధులు

పోలీసులంటే ఎవరో కాదు

మన కుటుంబ సభ్యులూ....

చెత్తను మురికిని మలినాలన్నీ

ఎత్తి పారేసేటి ఏకవీరులు

పారిశుద్ధ్య పనులు చేసే చేతులకి

సరిపోవు వేవేల కోటి దండాలు

కన్నతల్లి తండ్రి కూడ చాలరండీ

యేమిచ్చుకుంటే వారి రుణం తీరేనండీ

మానవ సేవకి అంకితమైనవాళ్లు

క్షేమంగానే ఉండాలని ప్రార్థించండీ

।। వియ్‌ విల్‌ స్టే ఎట్‌ హోమ్‌ ।।

।। వియ్‌ స్టే సేఫ్‌ ।।

- సంగీతం, గానం, రచన: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

ఇదీ చూడండి.. మలయాళ రీమేక్​లో బాలయ్య-రానా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.