టాలీవుడ్, కోలీవుడ్‌లో అగ్రహీరోల సరసన నటించింది హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. బాలీవుడ్‌లోనూ యారియాన్, అయ్యారే చిత్రాల్లో నటించిన ఈ అందాల భామ... తాజాగా అజయ్ దేవగణ్‌తో 'దే దే ప్యార్ దే' చిత్రంలో హీరోయిన్ పాత్ర పోషించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
-
Catch #DeDePyaarDe’s @ajaydevgn #Tabu @Rakulpreet on #RisingStar3 @ColorsTV tonight at 9pm! #DeDePyaarDeOnRisingStar @Shankar_Live @neetimohan18 @diljitdosanjh pic.twitter.com/d2b2gUqKiz
— De De Pyaar De (@DeDePyaarDe) May 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Catch #DeDePyaarDe’s @ajaydevgn #Tabu @Rakulpreet on #RisingStar3 @ColorsTV tonight at 9pm! #DeDePyaarDeOnRisingStar @Shankar_Live @neetimohan18 @diljitdosanjh pic.twitter.com/d2b2gUqKiz
— De De Pyaar De (@DeDePyaarDe) May 5, 2019Catch #DeDePyaarDe’s @ajaydevgn #Tabu @Rakulpreet on #RisingStar3 @ColorsTV tonight at 9pm! #DeDePyaarDeOnRisingStar @Shankar_Live @neetimohan18 @diljitdosanjh pic.twitter.com/d2b2gUqKiz
— De De Pyaar De (@DeDePyaarDe) May 5, 2019
'నేను ఇలానే మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నా. దాని కోసం 24 గంటలు కష్టపడగలను. సినిమాల్లో నన్ను ప్రజలు ఎక్కువగా చూడాలనుకుంటున్నారు. అందుకోసం మంచి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. భాషతో సంబంధం లేకుండా మంచి కథలు వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధమే'
-- రకుల్ ప్రీత్ సింగ్, కథానాయిక
కష్టపడేతత్వం, నిబద్ధతే నాకు దక్షిణాదిన ఇంత పేరు తెచ్చాయని చెప్పింది ఈ 28 ఏళ్ల భామ. తన వ్యక్తిగత అవసరాల కన్నా పనికోసమే ఎక్కువగా తపన పడుతుంటానని వెల్లడించింది. దక్షిణాదిన ఒక్కరోజులో స్టార్ కాలేదని... ఇంత పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడ్డా అని చెప్పింది రకుల్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2014లో విడులదైన 'యారియాన్' , 2018లో నీరజ్ పాండే దర్శకత్వంలోని 'అయ్యారే'తో బాలీవుడ్లో తనదైన నటనతో ఆకట్టుకుంది పొడుగు సుందరి.
'హిందీలో అరంగేట్రం చేసినపుడు ఎవరికీ పరిచయం లేని అమ్మాయిని.. యారియాన్ నాకు మంచి పేరు తెచ్చింది. దక్షిణాదిన నాకు వచ్చిన ఇమేజ్ ఇప్పడు ఓ స్టార్‌ని చేసింది. అయితే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రసీమల్లో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది. దాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తా' అని చెప్పింది రకుల్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">