మెగాహీరో వైష్ణవ్‌తేజ్.. తొలి సినిమా 'ఉప్పెన'తో అదిరిపోయే రికార్డు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే తెలుగులో డెబ్యూ హీరోల రికార్డులను తిరగరాసిన ఆయన.. ఇప్పుడు బాలీవుడ్ రికార్డునూ అధిగమించాడు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్ రికార్డును అధిగమించారు వైష్ణవ్. 21ఏళ్ల కిందట హృతిక్ నటించిన తొలి సినిమా 'కహో నా ప్యార్ హై' అప్పట్లో 5రోజుల్లో 42కోట్ల నెట్ వసూలు చేసింది. ఇన్నేళ్ళలో ఏ ఒక్క డెబ్యూ హీరో కూడా దాన్ని టచ్ చేయలేకపోయారు. ఇప్పుడు 'ఉప్పెన' ఐదు రోజుల్లోనే రూ.43కోట్లకు పైగా నెట్ వసూళ్లను అందుకుని హృతిక్ రికార్డును అధిగమించింది.
ఇదీ చూడండి: తొలిరోజు కలెక్షన్లతో 'ఉప్పెన' రికార్డు