రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేందుకు ఉన్న సమయం రెండు రోజులే. ప్రచారాలకు నేటితో తెరపడింది. ఈ సమయంలో ఓటరు నీ విలువ తెలుసుకో అంటూ సాగే ఓ సినిమా గీతం విడుదలైంది. మంచు విష్ణు నటించిన 'ఓటర్' సినిమాలోనిదే ఈ పాట.
రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం సగటు పౌరుడ్ని ఆలోచింపజేసేలా ఉంది. ఓటర్ కింగ్ మేకర్.. రింగ్ మాస్టర్..ఓటు విలువ తెలుసుకో అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. తమన్ సంగీతాన్ని అందించాడు.
సురభి హీరోయిన్గా నటించింది. జీఎస్ కార్తిక్ దర్శకత్వం వహించాడు. వచ్చే నెలలో విడుదల కానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: