Rashmika Mr.Majnu movie new release date: దక్షిణాదిలో టాప్ నాయికల్లో ఒకరైన రష్మిక 'మిషన్ మజ్ను' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే మే 13న రావాల్సిన ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది జూన్ 10న రిలీజ్ కానున్నట్లు తెలిపింది. సిద్ధార్థ్ మల్హోత్ర కథానాయకుడిగా నటించారు. శంతన్ బాగ్చి దర్శకత్వం వహిస్తున్నారు. 1970ల నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్ రా ఏజెంట్ మిషన్‌కు లీడర్‌గా నటించనున్నారు. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.
ఇటీవలే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం.. అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో వికాస్ భల్ దర్శకత్వంలో రానున్న 'గుడ్‌బై', 'పుష్ప 2' చిత్రాల్లో నటిస్తోంది.
విశ్వక్ కొత్త సినిమా
Viswak sen new movie: సినిమా అవకాశాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే 'అశోక వనంలో అర్జున కల్యాణం', 'గామి', 'ఓరీ దేవుడా' వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన.. తన కొత్త సినిమాను ప్రకటించారు. 'దాస్కా ధమ్కి' పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. నేడు(బుధవారం) ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత అల్లుఅరవింద్ క్లాప్ కొట్టగా.. దర్శకుడు అనిల్‌రావిపూడి సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో హీరోయిన్గా నివేదా పేతురాజ్ నటించనుంది. ఇటీవలే ఈ జంట 'పాగల్' చిత్రంతో సందడి చేసింది.
ఇదీ చూడండి: షారుక్ 'పఠాన్' లుక్స్.. స్టైలిష్‌గా అలియా భట్!