ETV Bharat / sitara

Vishwaksen: మీరు ఎంతమందైనా.. నేను మాత్రం ఒక్కడినే! - పాగల్​ మూవీ సక్సెస్​ మీట్​

కావాలనే 'పాగల్'​ సినిమాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని హీరో విశ్వక్​సేన్​ పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన మూవీ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎవరెన్ని ప్రచారాలు చేసిన సినిమా విజయవంతం చేసిన ఘనత ప్రేక్షకులదేనని వెల్లడించారు. ​

vishwaksen
విశ్వక్​సేన్​
author img

By

Published : Aug 21, 2021, 2:59 PM IST

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడిప్పుడే కెరీర్‌ సెట్‌ చేసుకుంటున్నానని.. కానీ, కొంతమంది సోషల్‌మీడియా వేదికగా తనపై నెగెటివిటీ క్రియేట్‌ చేస్తున్నారని విశ్వక్‌సేన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన 'పాగల్‌' ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్‌సేన్‌ నెగెటివ్ కామెంట్లు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పాగల్‌' సినిమా బాగున్నప్పటికీ కొంతమంది కావాలనే అసత్యప్రచారం చేస్తున్నారని అన్నారు.

"చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. ఎన్నో కష్టాలు ఎదుర్కొని 'వెళ్ళిపోమాకే'తో నటుడిగా పరిచయమయ్యా. నాకంటూ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో 'ఫలక్‌నామాదాస్‌' కథ రాసుకుని స్నేహితుల డబ్బులతో ఆ సినిమా తీసి హిట్‌ పొందా. 'పాగల్‌' సినిమా విడుదలకు ఒకరోజు ముందు విపరీతమైన నెగెటివిటీ ప్రారంభమైంది. నా గురించి, నా సినిమా గురించి అసత్య ప్రచారాలు జరిగాయి. ఎవరు ఈ ప్రచారాలు చేస్తున్నారో తెలీదు. కనిపించని శత్రువుతో నేను పోరాటం చేస్తున్నా. నెగెటివ్‌ ప్రచారాలు చేసేవాళ్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ.. ఇటు వైపు నేను ఒక్కడినే. వాటిని ఎదుర్కొంటా. వాళ్లపై నేను తిరిగి దాడి చేయలేను.. ఎందుకంటే వాళ్లలాగా నా దగ్గర వందల్లో సోషల్‌మీడియా అకౌంట్లు లేవు. ఎలాంటి ప్రచారాలు జరిగినా సరే నా సినిమాకి విజయం అందించిన ఘనత ప్రేక్షకులదే" అని విశ్వక్‌సేన్‌ అన్నారు.

ఇదీ చదవండి: Onam Special: చీరకట్టులో భామలు సూపర్ ఉన్నారంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.