తెలుగింటి అల్లుడు కాబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ అన్నారు. ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలతో గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఆయన.. 'అరణ్య' సినిమా విడుదల తర్వాత తమ పెళ్లి కబురు వినిపించనున్నున్నట్లు తెలిపారు. రానా నటించిన ఈ చిత్రంలో విష్ణువిశాల్ కీలక పాత్రలో నటించారు.
'అరణ్య' సినిమాలో తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు జ్వాల ఎంతో సహకరించిందన్నారు విశాల్. బ్యాడ్మింటెన్ అకాడమితో జ్వాల, తొలి తెలుగు సినిమాతో తాను ఎంతో ఆనందంగా ఉన్నామని వెల్లడించారు. 2021 తమ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అరణ్య సినిమా తప్పకుండా హిట్ అవుతుందని, అందులో తన నటనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. అడవుల అభివృద్ధిలో ఏనుగుల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుసాల్మాన్ రూపొందించిన 'అరణ్య' మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: అరణ్య' ట్రైలర్ రిలీజ్ డేట్.. 'వై' మోషన్ పోస్టర్