ETV Bharat / sitara

షూటింగ్​లో గాయపడ్డ విశాల్.. వీడియో వైరల్ - vishal not a common man

తమిళ కథానాయకుడు విశాల్​ మరోసారి షూటింగ్​లో గాయపడ్డారు. 'నాట్​ ఏ కామన్​ మ్యాన్​' సినిమా పోరాట సన్నివేశాల్లో విశాల్​కు తీవ్ర గాయమైంది. దీంతో చిత్రబృందం అతడిని ఆస్పత్రికి తరలించింది.

Vishal gets injured while shooting an action sequence for 'Vishal 31'
షూటింగ్​లో మరోసారి గాయపడిన విశాల్​
author img

By

Published : Jul 21, 2021, 9:12 PM IST

కోలీవుడ్‌ నటుడు విశాల్‌ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. తదుపరి సినిమా యాక్షన్‌ సీక్వెన్స్‌లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయమైంది. విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌'. శరవణన్ దర్శకత్వంలో విశాల్‌ 31వ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూట్‌ జరుగుతోంది. ఇందులో విశాల్‌పై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎంతో ఎనర్జిటిక్‌గా సాగుతోన్న క్లైమాక్స్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లో బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు విశాల్.

  • #Vishal got severe back injury at #Vishal31 shooting spot ,Hyderabad. While performing climax stunt sequence his back got injured severely like last time. Varma therapist who took care of the treatment already fixed it this time too. pic.twitter.com/HWk5Nb0ZQQ

    — BARaju's Team (@baraju_SuperHit) July 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ప్రమాదంలో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. దీంతో వైద్యులు ఆయనకి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్‌ వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

మరోవైపు గతంలో 'నాట్‌ ఏ కామన్‌ మ్యాన్‌' షూట్‌లో తీవ్రంగా గాయపడ్డారు విశాల్. ఫైట్‌ సీక్వెన్స్‌ సమయంలో సమన్వయ లోపం ఏర్పడటం వల్ల ఆయన తలకు, కంటికి స్వల్ప గాయాలయ్యాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. యువన్ శంకర్‌ రాజా స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి.. హైదరాబాద్​కు ఆలియా.. 'ఆర్ఆర్ఆర్' షూట్​కు రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.