ETV Bharat / sitara

విశాల్​ను మోసం చేసిన ఆ మహిళ.. ఆరేళ్లలో రూ.45 లక్షలు - హీరో విశాల్ కంపెనీలో మోసం

ప్రముఖ నటుడు విశాల్​ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఓ అకౌంటెంట్.. భారీస్థాయిలో మోసం చేసింది. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

విశాల్​ను మోసం చేసిన మహిళ.. ఆరేళ్లలో రూ.45 లక్షలు​
హీరో విశాల్
author img

By

Published : Jul 3, 2020, 6:52 PM IST

తమిళ హీరో విశాల్​ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న మహిళా అకౌంటెంట్ భారీస్థాయిలో మోసానికి పాల్పడింది. ఆరేళ్లలో ఏకంగా రూ.45 లక్షల్ని తన సొంత ఖాతాలోకి మళ్లించింది. దీనిపై కంపెనీ మేనేజర్ కేసు పెట్టగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది జరిగింది?

విశాల్.. నటుడిగానే కాకుండా నిర్మాతగా, నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో 'పందెం కోడి 2', 'అభిమన్యుడు', 'డిటెక్టివ్​'తో పాటు పలు సినిమాల్ని నిర్మించారు. ఈ క్రమంలోనే తన సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా అకౌంటెంట్.. ఇన్​కమ్​ట్యాక్స్​ కట్టాల్సిన డబ్బుల్ని, తన బ్యాంక్​ ఖాతాల్లోకి మళ్లించుకుంది. ఈ మొత్తం రూ.45 లక్షలుగా తేలింది. గత ఆరేళ్లుగా ఈ తంతు జరుగుతూ ఉన్న ఎవరూ గుర్తించలేదు. ఇటీవలే అనుమానం వచ్చి పరిశీలించగా ఈ నిజం బయటపడింది. దీంతో సంస్థ మేనేజర్.. విరుగమ్​బాకమ్​ పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టారు. ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు సాగుతోంది.

విశాల్.. 'డిటెక్టివ్ 2'తో పాటు 'చక్ర' అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే వచ్చిన 'చక్ర' ట్రైలర్ అలరిస్తోంది. వైర్​లెస్​ మాధ్యమాల వల్ల జరిగే సైబర్ క్రైమ్​ల గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. త్వరలో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.