ETV Bharat / sitara

డబుల్​ సర్​ప్రైజ్​: 'కామ్రేడ్ భారతక్క'గా ప్రియమణి - ప్రియమని పుట్టినరోజు

ప్రముఖ హీరోయిన్​ ప్రియమణి నటించిన 'విరాటపర్వం','నారప్ప' చిత్రాల నుంచి సర్​ప్రైజ్​లు వచ్చాయి. నేడు ఈ అమ్మడు 36వ పుట్టినరోజు సందర్భంగా తొలి రూపు విడుదల చేశాయి ఆయా చిత్రబృందాలు. 'రెండు లుక్​లు​ అదుర్స్'​ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నటికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.

priyamani look in virataparvam
కామ్రేడ్ భారతక్క'గా హీరోయిన్​ ప్రియమణి
author img

By

Published : Jun 4, 2020, 11:23 AM IST

Updated : Jun 5, 2020, 3:30 AM IST

తెలుగులో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. 'పెళ్లైన కొత్తలో' సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసిన ఈ భామ.. 'యమదొంగ', 'కింగ్‌'లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రానా, సాయి పల్లవి కాంబినేషన్​లో వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న 'విరాటపర్వం' చిత్రంలో నటిస్తోంది. నేడు 36వ పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ నటి లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నక్స్​లైట్​ పాత్రలో కనిపించింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. నందితా దాస్, టబు, జరీనా వహబ్, ఈశ్వరీ రావు తదితరులు నటిస్తున్నారు.

మరో సర్​ప్రైజ్​...

వెంకటేష్‌తో కలిసి 'నారప్ప' సినిమాలోనూ నటిస్తోంది ప్రియమణి. ఈ చిత్రలోని ఆమె తొలిరూపును​ విడుదల చేసింది చిత్రబృందం. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. దగ్గుబాటి సురేష్, సుధాకర్‌ చెరుకూరి నిర్మాతలు. అంతేకాకుండా విక్టరీ వెంకీతోనే 'సిరివెన్నెల' అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది.

ఇదీ చూడండి: ఆ సినిమాను 15 కోట్ల మంది చూద్దామనుకున్నారు!

Last Updated : Jun 5, 2020, 3:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.