యువ నటీనటులు రిహాన్, సారిక కలిసి నటించిన చిత్రం 'విరహం'. ఇటీవలే సినిమా పోస్టర్ విడుదల చేయగా.. అది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం రంగం సిద్ధం చేసింది. ఈ సినిమాతో సురేందర్ జీ యాదవ్ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మాస్టర్ శ్రేయాన్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా కోసం కో-డైరెక్టర్ జెర్రీ జీవన్‌రెడ్డి, కెమెరామెన్ ధర్మసాయి అద్భుతమైన ప్రతిభ కనబరిచారని దర్శకుడు సురేందర్ జీ యాదవ్ తెలిపారు. విరహం చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కో-డైరెక్టర్ జెర్రీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వల్ల థియేటర్లు మూసేసిన కారణంగా త్వరలోనే ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.