కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay Thalapathy) రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త దక్షిణాదిలో హాట్ టాపిక్‌గా మారింది. తన తదుపరి చిత్రం కోసం రూ.90కోట్లు తీసుకోనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
విజయ్.. దిల్‌రాజు(Dilraju) నిర్మాణంలో దర్శకుడు వంశీ పైడిపల్లితో(Vamsi Paidipally) ఓ సినిమా చేయనున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను రూ.170కోట్లతో నిర్మించనున్నారని, దీని కోసమే దళపతి పెద్ద మొత్తంలో తీసుకోనున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. కరోనా కారణంగా షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది.
ఇదీ చూడండి: The Family Man 2: సమంత రెమ్యునరేషన్ అన్ని కోట్లా?