ETV Bharat / sitara

'మాస్టర్' సినిమానూ వదలని పైరసీ భూతం!​ - lokesh kanagaraj on master movie leaked

'మాస్టర్​' సినిమా విడుదలకు ముందే ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు నెట్టింట వైరల్​గా మారాయి. అయితే ఆ లింకులను షేర్​ చేసి.. ఏడాదిన్నర పాటు తాము పడ్డ కష్టాన్ని వృథా చేయొద్దని దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ ట్విట్టర్​లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Vijay's much-awaited film Master leaked online hours before release
'మాస్టర్' సినిమానూ వదలని పైరసీ భూతం!​
author img

By

Published : Jan 12, 2021, 1:09 PM IST

Updated : Jan 12, 2021, 1:23 PM IST

దళపతి విజయ్​ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'మాస్టర్​' చిత్రం నెట్టింట లీక్​ అయ్యింది. సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు విడుదలకు ముందే సోషల్​మీడియాలో దర్శనమివ్వడంపై చిత్రబృందం ఆశ్చర్యానికి గురైంది. దీనిపై స్పందించిన చిత్రబృందం.. దయచేసి పైరసీ లింక్​లను షేర్​ చేయొద్దని ప్రేక్షకులను వేడుకుంటోంది. సినిమాలో విజయ్​ ఎంట్రీ సహా మరికొన్ని కీలక సన్నివేశాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.

అయితే సోషల్​మీడియాలో వైరల్ అయిన వీడియోలు.. డిస్ట్రిబ్యూటర్​ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన షోకు సంబంధించినవని కొన్ని వార్తాసంస్థలు నివేదించాయి. ఈ విషయంపై దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​ ట్విట్టర్​లో స్పందించారు.

  • Dear all
    It's been a 1.5 year long struggle to bring Master to u. All we have is hope that you'll enjoy it in theatres. If u come across leaked clips from the movie, please don't share it 🙏🏻 Thank u all. Love u all. One more day and #Master is all yours.

    — Lokesh Kanagaraj (@Dir_Lokesh) January 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మాస్టర్​' సినిమాను మీముందుకు తీసుకురావడానికి ఏడాదిన్నర కాలం పాటు కష్టపడ్డాం. మీరంతా థియేటర్​లోనే సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. ఈ చిత్రంలోని లీకైన వీడియో లింకులను సోషల్​మీడియాలో దయచేసి షేర్​ చేయకండి".

- లోకేశ్​ కనగరాజ్​, 'మాస్టర్' చిత్ర దర్శకుడు

'మాస్టర్'​ చిత్రంలో విజయ్​ సరసన మాళవిక మోహనన్​ హీరోయిన్​గా నటించగా.. విజయ్​ సేతుపతి, ఆండ్రియా జెరెమియా, శాంతను భాగ్యరాజ్​, అర్జున్​ దాస్​, గౌరీ జీ కిషన్​ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్​ సంగీతాన్ని సమకూర్చగా.. జేవియర్స్​ బ్రిట్టోకు చెందిన ఎక్స్​బీ ఫిల్మ్​ క్రియేటర్స్​ సంస్థ నిర్మించింది.

ఇదీ చూడండి: త్వరలో విడుదల కాబోతున్న చిత్రాలివే!

Last Updated : Jan 12, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.