ETV Bharat / sitara

అసమాన ప్రతిభకు కొలమానం.. 'విజయ' ప్రస్థానం

బాలనటిగా..హీరోయిన్​గా.. దర్శకురాలిగా మెప్పించిన వ్యక్తి విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. 1946 ఫిబ్రవరి 20న జన్మించిన ఆమె 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

విజయ నిర్మల
author img

By

Published : Jun 27, 2019, 3:51 AM IST

Updated : Jun 27, 2019, 7:54 AM IST

'వస్తాడు ..నా రాజు ఈరోజూ అంటూ'.. అమయాకపు చూపులతో ప్రియుడు కోసం ఎదురుచూస్తున్న యువతి పాత్రలో మెప్పించిన నటి విజయనిర్మల. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా తన ప్రతిభాపాటవాలను చాటిన విజయనిర్మల అనారోగ్యంతో మృతి చెందారు. ఎన్నో ఘనతలను సాధించిన విజయ నిర్మల ప్రస్థానం సాగిందిలా..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కుటుంబ నేపథ్యం..

విజయనిర్మల మద్రాసులో 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. తండ్రి రామ్మోహనరావు, తల్లి శకుంతలాదేవి. ప్రముఖ గాయని రావు బాలసరస్వతిదేవి.. విజయనిర్మల మేనత్త కూతురే. మరో నటి జయసుధ పెద్దనాన్న మనవరాలు. చిన్నతనం నుంచే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు విజయనిర్మల. సినిమా నేపథ్యమే కావడంతో బాలనటిగా తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు.

ACTRESS
విజయనిర్మల

బాలనటిగా మెప్పించిన విజయనిర్మల..

దర్శకుడు పి. పుల్లయ్య ‘మత్సరేఖ’ (1953) తమిళ సినిమాలో విజయనిర్మలకు బాలనటిగా అవకాశమిచ్చాడు. అనంతరం సింగారి, మనంపోల్‌ మాంగల్యం.. హిందీ చిత్రం హమ్ పంఛీ ఏక్ డాల్ లాంటి చిత్రాల్లో బాలనటిగా మెప్పించారు విజయనిర్మల. తెలుగులో పాండురంగ మహత్యం, జయకృష్ణా ముకుందా మురారి, భూకైలాస్ లాంటి చిత్రాల్లో నటించారు. బాలనటిగా భూకైలాస్ ఆఖరు చిత్రం.

మలయాళ చిత్రంతో హీరోయిన్​గా అరంగేట్రం..

1964లో వచ్చిన మలయాళ చిత్రం భార్గవి నిలయంతో హీరోయిన్​గా అరంగేట్రం చేశారు విజయనిర్మల. తెలుగులో రంగులరాట్నం చిత్రంతో కథానాయికగా పరిచమయ్యారు. అక్కడి నుంచి దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. అనంతరం పెళ్లికానుక సీరియల్​తో బుల్లితెర ప్రవేశం చేశారు.

సూపర్​స్టార్ కృష్ణతో వివాహం..

ACTRESS
కృష్ణతో విజయనిర్మల

తొలిసారి సాక్షి చిత్రంలో కృష్ణ సరసన నటించారు విజయనిర్మల. అనంతరం వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్లో వీరిద్దరిది హిట్ పెయిర్. 1969 మార్చి 24న తిరుపతిలో కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల. పెళ్లైన తర్వాత సినిమాలకు గుడ్​ బై చెప్తారని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత సూపర్​స్టార్​తో కలిసి 50 సినిమాల్లో నటించారు. కృష్ణ కంటే ముందు కృష్ణమూర్తిని(నటుడు నరేశ్ తండ్రి) పెళ్లి చేసుకున్నారు విజయనిర్మల.

కుమారుడు నరేశ్ కూడా సినీనటుడే. ప్రస్తుతం మూవీ ఆర్ట్స్​ అసొసియేషన్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నాడు.

దర్శకురాలిగా గిన్నీస్ రికార్డు..

ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నీస్ బుక్​లో చోటు దక్కించుకున్నారు. 2002లో ఈ ఘనత సాధించారు. అంతకంటే ముందు ఇటలీ దర్శకురాలు పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు.

ACTRESS
గిన్నీస్ రికార్డు అందుకున్న విజయనిర్మల

1971లో 'మీనా' అనే చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్న విజయనిర్మలకు 2009లో వచ్చిన 'నేరము - శిక్ష' చిత్రం దర్శకురాలి ఆఖరి సినిమా. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలతో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ACTRESS
దర్శకురాలిగా 44 చిత్రాలు తీసిన విజయనిర్మల

విజయ నిర్మల విశేష సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును ఇచ్చి గౌరవించింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం రాత్రి హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు.

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 26 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: US Senate Border Bill Vote AP Clients Only 4217730
US Senate passes bill to care for migrants
AP-APTN-2045: El Salvador Drowned Migrants AP Clients Only 4217722
El Salvador: Mother mourns loss of her son and grandaughter
AP-APTN-2027: UN Iran AP Clients Only 4217728
Iran 'will not' take burden of nuclear deal
AP-APTN-2005: Hong Kong Protest Police AP Clients Only 4217720
Hong Kong protesters around Police headquarters
AP-APTN-2004: Georgia Protest AP Clients Only 4217719
Mass protests continue in Tbilisi
AP-APTN-1955: Russia Venezuela AP Clients Only 4217721
Russia hails Norway-brokered Venezuela talks
AP-APTN-1919: US Trump Mueller Russia AP Clients Only 4217718
Heading to Asia, Trump plans talks on trade, Iran
AP-APTN-1916: US Rapinoe White House Mandatory on-screen courtesy 'Eight by Eight Magazine' and include social handle @8by8mag 4217717
US women's football star snubs White House
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 27, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.