ETV Bharat / sitara

'విక్రమ్'లో విలన్​గా విజయ్ సేతుపతి? - విజయ్ సేతుపతి న్యూస్

కమల్​హాసన్ కథానాయకుడిగా నటించనున్న 'విక్రమ్'లో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలో ఉంది.

Vijay Sethupathi 'Vikram' movie
'విక్రమ్'లో విలన్​గా విజయ్ సేతుపతి?
author img

By

Published : Apr 21, 2021, 7:41 AM IST

'ఉప్పెన'లో తనదైన నటనతో మెప్పించిన విజయ్‌ సేతుపతి.. దక్షిణాదిలో ఎంత బిజీ నటుడో చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల వరకూ ఆయన డేట్లు దొరకడం కష్టమయ్యే పరిస్థితి. ఇప్పుడు కమల్‌హాసన్‌ 'విక్రమ్‌'లోనూ ప్రతినాయకుడిగా సేతుపతి నటించే అవకాశాలున్నాయని అంటోంది కోలీవుడ్‌. ఈ చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దీనిపై సేతుపతితో మాట్లాడారు. డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల సేతుపతి ఆలోచనలో పడ్డారట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"ఇంత పెద్ద ప్రాజెక్టు.. పైగా కమల్‌ హాసన్‌ చిత్రం.. అవకాశం రావడమే గొప్ప. అలాంటి దాన్ని వదలుకోకూడదనుకుంటున్నా. డేట్లు సర్దుబాటు కోసం ప్రయత్నిస్తున్నా" అని విజయ్ సేతుపతి చెప్పారు. సేతుపతి ఇప్పటికే లోకేష్‌ కనగరాజ్‌ తీసిన 'మాస్టర్‌'లో ప్రతినాయకుడిగా మెప్పించారు. మరోసారి వీరిద్దరు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు కోలీవుడ్‌ అంటోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.