టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండ, రష్మిక.. మంగళవారం సాయంత్రం ముంబయిలో కనిపించారు. మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించడం అభిమానులను ఆలోచనల్లో పడేసింది. అసలు విషయం ఏంటంటే వీరు నటించిన 'డియర్ కామ్రేడ్'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ముంబయిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరోహీరోయిన్లు ఇద్దరూ హాజరయ్యారు.
దక్షిణాదిలో నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇప్పటికే ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు.
ఇది చదవండి: అతిలోక సుందరే కదా..! నిజమా? భ్రాంతా?