న్యాయవ్యవస్థలో విచారణ ఖైదీల నేపథ్యంగా 'నాంది' పేరుతో దర్శకుడు విజయ్ కనకమేడల సినిమాను రూపొందించారు. నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, దేవీ ప్రసాద్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన దర్శకుడు విజయ్.. న్యాయ నిపుణులు, సీనియర్ పోలీసు అధికారులను సంప్రదించి ఆరు నెలలు పరిశోధన చేసిన తర్వాతే ఈ సినిమాను మొదలుపెట్టినట్లు తెలిపారు. తన చిత్రం న్యాయవ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఉంటుందని అన్నారు. సూర్య ప్రకాశ్ పాత్ర కోసం నరేష్ చాలా కష్టపడ్డారని వెల్లడించారు.
'ఆ సన్నివేశాల్లో నరేష్ నటన అద్భుతం' - నాంది గురించి విజయ్ కనకమేడల
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నాంది'. న్యాయవ్యవస్థలో విచారణ ఖైదీల నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 19న విడుదలవబోతున్న నేపథ్యంలో ఈటీవీ భారత్తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు దర్శకుడు విజయ్.
!['ఆ సన్నివేశాల్లో నరేష్ నటన అద్భుతం' Vijay Kanakamedala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10636991-776-10636991-1613388982241.jpg?imwidth=3840)