ETV Bharat / sitara

కరోనా కారణంగా లైగర్​ టీజర్​ రిలీజ్​ వాయిదా - విజయ్​ దేవరకొండ లైగర్

విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'లైగర్' చిత్ర టీజర్​ విడుదల వాయిదా పడింది. విజయ్​ పుట్టినరోజు సందర్భంగా మే 9న టీజర్​ను రిలీజ్​ చేయాల్సిఉండగా.. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Vijay Deverakonda's Liger movie Teaser is Postponed
లైగర్​ టీజర్​ రిలీజ్​ వాయిదా
author img

By

Published : May 9, 2021, 11:10 AM IST

రౌడీహీరో విజయ్​ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో రూపొందుతోన్న చిత్రం 'లైగర్'​. బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. మే 9న విజయ్​ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్​ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. కానీ, దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో టీజర్​ను విడుదల చేయడం సరైనది కాదని చిత్రబృందం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీజర్​ విడుదలను వాయిదా వేస్తున్నామని తెలిపి.. కొత్త రిలీజ్​ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా నిర్మాణసంస్థ తెలియజేసింది.

Vijay Deverakonda's Liger movie Teaser is Postponed
నిర్మాణసంస్థల సంయుక్త ప్రకటన

"విజయ్​ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మే 9న 'లైగర్​' పవర్​ప్యాక్డ్​ టీజర్​ను రిలీజ్​ చేయాలని తొలుత సిద్ధమయ్యాం. అంతలోనే దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీజర్​ విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించాం. అయితే ఈ టీజర్​లో విజయ్​ దేవరకొండను ఎప్పుడు చూడని విధంగా టీజర్​లో కనువిందు చేస్తాడని హామీ ఇస్తున్నాం" అని నిర్మాణసంస్థలు పీసీ కనెక్ట్​, ధర్మ ప్రొడక్షన్స్​ సంయుక్తంగా ప్రకటించాయి.

ఇదీ చూడండి: కుర్రకారు మదిని 'డిస్టర్బ్​ చేస్తున్నాదీ' బ్రిటీష్​ భామ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.