యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవలే టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రబృందం.. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా దీపావళి కానుకగా ఓ మ్యూజిక్ వీడియోను ఈరోజు విడుదల చేసింది. 'నువ్వే హీరో' అనే టైటిల్‌తో సాగిన పాటలో విజయ్ స్టైలిష్ లుక్, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రంలో వాణి భోజన్ హీరోయిన్. అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శివకుమార్ ఈ సినిమాకు సంగీతమందించాడు. నవంబరు ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.