ETV Bharat / sitara

అభిమానుల హంగామాకు రౌడీ హీరో భావోద్వేగం - లైగర్​ ఫస్ట్​లుక్​

ఒకానొక సమయంలో తన నటనను ప్రేక్షకులు గుర్తిస్తారా? అని బాధపడేవాడ్ని అంటున్నారు హీరో విజయ్​ దేవరకొండ. కానీ, ప్రస్తుతం 'లైగర్​' చిత్ర ఫస్ట్​లుక్​కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణ చూస్తే ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

vijay devarakonda emotional on fans love
అభిమానుల హంగామాకు రౌడీ హీరో భావోద్వేగం
author img

By

Published : Jan 20, 2021, 11:38 AM IST

Updated : Jan 20, 2021, 12:03 PM IST

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియన్‌ సినిమా 'లైగర్‌'. ఇటీవల ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో విజయ్‌ పూర్తి‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. 'లైగర్‌' ఫస్ట్‌లుక్‌పై ఆనందం వ్యక్తం చేసిన అభిమానులు పాలాభిషేకాలు, తీన్‌మార్‌ డ్యాన్స్‌లు, కేక్‌ కటింగ్స్‌తో సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్​ తనపై చూపించిన ప్రేమకు విజయ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

  • Listen & Remember these words -
    You just wait for the teaser - I am guaranteeing Nation wide Madness!

    Full Love
    Your man,
    Vijay Deverakonda

    — Vijay Deverakonda (@TheDeverakonda) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీరే నా ప్రేమ (అభిమానులను ఉద్దేశిస్తూ). 'లైగర్‌' టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైన రోజు మీరు నన్ను ఎంతగానో భావోద్వేగానికి గురి చేశారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యాను. ప్రేక్షకుల్లో ఒక్కరైనా నా నటనను గుర్తిస్తారా? నా సినిమాలు చూడడానికి థియేటర్‌కు వస్తారా? అని ఒకానొక సమయంలో ఎంతో బాధపడేవాడిని. 'లైగర్‌' పోస్టర్‌ విడుదల చేసిన తర్వాత ఎన్నో ప్రాంతాల్లో జరిగిన సెలబ్రేషన్స్‌ చూసి నాకెంతో ఆనందంగా అనిపించింది. టీజర్‌ విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి వేడుకలే జరుగుతాయని గ్యారంటీ ఇస్తున్నా.. నా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీ విజయ్‌ దేవరకొండ."

- విజయ్​ దేవరకొండ, కథానాయకుడు

బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'లైగర్​' సినిమా కోసం విజయ్.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇందులో విజయ్​ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్యపాండే హీరోయిన్​గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పీసీ కనెక్ట్స్​, ధర్మా ప్రొడక్షన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్​ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నారు.

vijay devarakonda emotional on fans love
'లైగర్​' సినిమా ఫస్ట్​లుక్​

ఇదీ చూడండి: ఖుషీ కపూర్ బాలీవుడ్​ ఎంట్రీకి రంగం సిద్ధం

Last Updated : Jan 20, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.