ETV Bharat / sitara

'పాట తప్ప మరేది ప్రేమను వ్యక్తపరచలేదు' - యారా మూవీలోని భేడి పాట

ప్రేమను ఓ అందమైన పాటతో వ్యక్తపరచవచ్చని అంటున్నాడు బాలీవుడ్​ విలక్షణ నటుడు విద్యుత్​ జమ్వాల్​. తాను, శ్రుతిహాసన్​ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'యారా'. ఈ సినిమాలోని 'భేడి' అనే ప్రేమ పాట తాజాగా నెట్టింట సందడి చేస్తోంది.

Vidyut Jammwal, Shruti Haasan starrer Yaara new track out
'అందమైన పాట తప్ప మరేది ప్రేమను వ్యక్త పరచలేదు'
author img

By

Published : Jul 22, 2020, 9:15 AM IST

బాలీవుడ్​ విలక్షణ నటుడు విద్యుత్​ జమ్వాల్​, శ్రుతి హాసన్​ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'యారా'. ఈ చిత్రంలోని 'భేడి' అనే పాటను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని విద్యుత్​ జమ్వాల్​ తన ఇన్​స్టాగ్రామ్​లో వెల్లడించాడు.

"ప్రేమను ఓ అందమైన పాట తప్ప మరేది వ్యక్తపరచలేదు. 'యారా' చిత్రంలోని అంకిత్​ తివారీ, ఐశ్వర్య మజుందర్​ పాడిన 'భేడి' పాట వినండి. ప్రేమ, స్నేహం రెండు కలగలిపినదే యారా చిత్రం " అని విద్యుత్​ జమ్వాల్​ ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు.

2 నిమిషాల 32 సెకన్ల నిడివి కలిగిన వీడియోలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ గాఢతను ప్రతిబింబిస్తూ ఈ పాటను చిత్రీకరించారు. సాంగ్​లో విద్యుత్​ జమ్వాల్​, శ్రుతి హాసన్​ల నటన ప్రేక్షకుల హృదయాన్ని తట్టి లేపుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2011లో విడుదలైన ఫ్రెంచ్​ చిత్రం 'గ్యాంగ్​ స్టోరీ'కి రీమేక్​గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. టిగ్మాన్షు ధులియా సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహిస్తున్నాడు. యౌరా చౌక్డి గ్యాంగ్​లో భాగమైన ఫగున్​, మిట్వా, రిజ్వాన్​, బహదూర్​ అనే నలుగురు నేరస్థుల స్నేహం చుట్టూ ఈ కథనం నడుస్తుంది. 'యారా' చిత్రం ఈ నెల 30వ తేదీన ఓటీటీ వేదికైన జీ5 యాప్​లో విడుదల కాబోతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.