ETV Bharat / sitara

'మహానటి'గా ఈ ముద్దుగుమ్మలనే అనుకున్నారట! - vidyabalan mahanati

'మహానటి' సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్​ నటన అందరినీ కట్టిపడేసింది. ఆ చిత్రంలో ప్రదర్శనకు జాతీయ అవార్డునూ అందుకుంది. అయితే ఈ పాత్రలో కీర్తి కన్నా ముందు బాలీవుడ్​ నటీమణులు విద్యాబాలన్​, సోనాక్షి సిన్హాని సంప్రదించాలని అనుకుందట చిత్రబృందం.

Vidyabalan, Sonakshi plays the role of  mahanati
విద్యాబాలన్​, సోనాక్షి సిన్హా
author img

By

Published : Sep 12, 2020, 9:02 AM IST

'మహానటి' సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించి ఘన విజయం అందుకున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. నటి కథను కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకున్నారు. బయోపిక్‌ అంటే అంత సులభం కాదు. స్క్రిప్ట్‌ పక్కాగా ఉన్నా.. ఆయా పాత్రలకు ఎవరైతే న్యాయం చేయగలరు? అని పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది మహానటిగా తెలుగువారి మన్ననలు అందుకున్న సావిత్రి పాత్రను పోషించాలంటే? ఇదే సందేహం ఉండేది మహానటి చిత్ర బృందానికి.

ఎందరో నాయికల్ని అన్వేషించగా కీర్తి సురేశ్​ ఎంపికైంది. ఆ తర్వాత తనదైన నటనతో సావిత్రినే మైమరపించింది. అయితే కీర్తి ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టక ముందు దర్శకుడి మదిలో బాలీవుడ్‌ నాయికలూ మెదిలారు. విద్యా బాలన్, సోనాక్షి సిన్హాని ముందు ఈ పాత్ర కోసం అనుకున్నారట. కానీ వాళ్లని సంప్రదించలేదు. ఒకవేళ వీరు సావిత్రి పాత్రలో నటించి ఉంటే ఎలా ఉండేదో.? వీళ్లతో పాటు తమిళ నటి అమలాపాల్​నూ‌ సంప్రదించాలని చిత్రబృందం భావించిందట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: హాస్యనటుడి పిల్లలకు అండగా నిలిచిన హీరో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.