ఇస్రో శాస్త్రవేత్తలు మార్స్‌పైకి మంగళ్యాన్ ఉపగ్రహాన్ని పంపి చరిత్ర సృష్టించారు. ఈ ప్రయోగం నేపథ్యంలో బాలీవుడ్లో 'మిషన్ మంగళ్' సినిమా తెరకెక్కింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించగా విద్యాబాలన్, తాప్సీ, సోనాక్షి సిన్హా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాపై విద్యాబాలన్ తన మనసులోని మాటలు పంచుకుంది.
దేశం గర్వపడే విధంగా ఇలాంటి నిజ జీవిత కథలో నటించటం ఆనందంగా ఉందంటోంది విద్యాబాలన్. దేశ గొప్పతనం తెలిసేలా మరిన్ని సినిమాలు వస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసింది.
"నేను వేరే దేశాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడి ప్రజలు వారి దేశం, వారసత్వం గురించి గర్వపడటం చూశాను. నిజంగా గర్వించాల్సింది భారతీయులు. మన చరిత్ర, సంస్కృతి, విజయాలు చాలా గొప్పవి. వీటిని అందరికీ తెలియజేయాలి. 'మిషన్ మంగళ్' ద్వారా ఆ పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళా తారాగణంతో ఈ సినిమా తీయటం ఇంకా గొప్ప విషయం."
-విద్యాబాలన్, బాలీవుడ్ హీరోయిన్
ఈ చిత్రానికి దర్శకుడిగా జగన్ శక్తి, నిర్మాతగా ఆర్.బాల్కి వ్యవహరించారు. రెండున్నర గంటల పాటు ఈ సినిమాలో మహిళల విజయాలను చూపించటానికి ప్రయత్నించామని చిత్ర బృందం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదలకానుందీ సినిమా.
ఇది సంగతి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో మాస్టర్ బ్లాస్టర్