యువ నటుడు విక్కీ కౌశల్.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విలక్షణ కథలతో దూసుకెళ్తున్నాడు. ఇతడు, బాలీవుడ్ బార్బీ కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నట్లు కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో సందడి చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన వార్త మరొకటి వైరల్‌గా మారింది.
ఇటీవలే విక్కీ-కత్రిన కుటుంబాలు ఎంగేజ్మెంట్ విషయమై చర్చించుకున్నాయట. రోకా వేడుకను కూడా జరిపాయని తెలుస్తోంది. ఈ సమయంలోనే ఎంగేజ్మెంట్ ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం. ఈ వార్త విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ వార్తలపై కత్రిన స్నేహితులు క్లారిటీ ఇచ్చారు. ఎంగేజ్మెంట్ కానీ, రోకా వేడుక కానీ జరగలేదని వారు తెలిపారు. ప్రస్తుతం కత్రిన 'టైగర్ 3' షూటింగ్లో బిజీగా ఉందని స్పష్టం చేశారు.
కొంతకాలం క్రితం విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారంపై స్పందించాడు నటుడు హర్షవర్ధన్ కపూర్. ఈ జంట ప్రేమలో ఉన్నది నిజమేనని చెప్పాడు. 'సినీ ఇండస్ట్రీలో నిజమైన రిలేషన్షిప్ ఎవరిది?' అని అడిగిన ప్రశ్నకు 'విక్కీ, కత్రిన కలిసున్నారనేది నిజం' అని బదులిచ్చాడు. తక్షణమే 'ఇది చెప్పినందుకు నేనేమైనా ఇబ్బందుల్లో పడతానా?' అని అన్నాడు.
సల్మాన్ ముందే ప్రపోజ్
కత్రినా కైఫ్‌కు, సల్మాన్ ఖాన్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ అవార్డు ఫంక్షన్లో సల్మాన్ ఎదుటే.. విక్కీ.. కత్రినాకు ప్రపోజ్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఓ అవార్డు ఫంక్షన్లో విక్కీ హోస్ట్‌గా ఉండగా.. కత్రిన అవార్డు ఇచ్చేందుకు వచ్చింది. అప్పుడు విక్కీ.. కత్రినకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్నాడు.