ETV Bharat / sitara

'ఆదిపురుష్'​లో ప్రభాస్​ తమ్ముడిగా బాలీవుడ్​ యువ హీరో - vicky kaushal

ఓం రౌత్​ దర్శకత్వంలో ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్​' సినిమాలో లక్ష్మణుడిగా బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్​ కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన 'సర్దార్ ఉద్ధమ్​ సింగ్'​, 'ది గ్రేట్​ ఇండియన్​ ఫ్యామిలీ' సినిమాల్లో నటిస్తున్నారు.

prabhas
ప్రభాస్​
author img

By

Published : Mar 10, 2021, 5:50 PM IST

దర్శకుడు ఓం రౌత్​-హీరో ప్రభాస్​ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా 'ఆదిపురుష్​'. ఈ సినిమాలో డార్లింగ్​.. రాముడి పాత్ర పోషించనుండగా.. రావణుడిగా బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ నటిస్తున్నారు. అయితే లక్ష్మణుడి పాత్ర ఎవరు చేయబోతున్నారా అని సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రను బీటౌన్​ యువ హీరో విక్కీ కౌశల్​ పోషించనున్నారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

ఇక సీత పాత్ర విషయంలోనూ పలువురు హీరోయిన్ల పేర్లు వినపడుతున్నాయి.

ప్రస్తుతం 'ఆదిపురుష్​' చిత్రీకరణ జరుపుకుంటోంది. పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ప్రస్తుతం ప్రభాస్​... ఈ సినిమాతో పాటు నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో ఓ చిత్రం,' సలార్'​, 'రాధేశ్యామ్​' సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా, విక్కీ కౌశల్.. ఉరి: ది సర్జికల్​ స్ట్రైక్​, సంజు, రాజి, లస్ట్​ స్టోరీస్​, బాంబే వెల్వెట్​ వంటి హిట్​ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం 'సర్దార్​ ఉద్ధమ్​ సింగ్'​, 'ది గ్రేట్​ ఇండియన్​ ఫ్యామిలీ' సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆదిపురుష్'​ను తెరకెక్కించడం చాలా కష్టం: ఓం ​రౌత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.