శర్వానంద్ హీరోగా ఇటీవల విడుదలైన 'శ్రీకారం' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని పలువురు ప్రశంసలను అందుకుంది. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఈ సినిమాను, చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. యువత ఈ సినిమాను చూడాలని పిలుపునిచ్చారు.
"అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో, ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్లవచ్చు అన్న సందేశాన్ని శ్రీకారం అందిస్తోంది. యువత చూడదగిన చక్కని చిత్రం." అని వెంకయ్యనాయుడు అన్నారు.
-
వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు. pic.twitter.com/yDoho6IH0W
— Vice President of India (@VPSecretariat) March 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు. pic.twitter.com/yDoho6IH0W
— Vice President of India (@VPSecretariat) March 22, 2021వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు. pic.twitter.com/yDoho6IH0W
— Vice President of India (@VPSecretariat) March 22, 2021
ఈ చిత్రాన్ని కిశోర్ తెరకెక్కించారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. రైతు పాత్రలో శర్వానంద్ ఆకట్టుకున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలై అభిమానులను అలరిస్తోంది.
ఇదీ చూడండి: 'శ్రీకారం' కథ అలా పుట్టింది: చిత్ర దర్శకుడు