సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రం 'టెర్మినేటర్' సిరీస్ నుంచి త్వరలో మరో సినిమా రాబోతోంది. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు విజయ్‌దేవరకొండ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించింది నిర్మాణ సంస్థ. హైదరాబాద్ వేదికగా బుధవారం ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది.
టెర్మినేటర్ సిరీస్‌లో ఆరో చిత్రంగా రానుంది 'టెర్మినేటర్ డార్క్ ఫేట్'. ఇటీవలే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ యూట్యూబ్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకెళ్తోంది. ప్రముఖ దర్శక, నిర్మాత జేమ్స్ కేమరూన్ ఈ సినిమాకు నిర్మాత. 'డెడ్‌పూల్' ఫేం టిమ్ మిల్లర్ దర్శకుడు.
ఇందులో మెకంజీ డేవిస్, నటాలియా రేయిస్, గాబ్రియేల్ లూనాతో పాటు యాక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్, లిండా హామిల్టన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దక్షిణాదిన తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో సందడి చేయనుందీ చిత్రం.
-
మీ స్క్వార్జ్నెగ్గర్ థియేటర్లో దద్దరిల్లే యాక్షన్ సీన్లతో అలరించడానికి నవంబరు ఒకటిన వస్తున్నాడు.
— Fox Studios India (@FoxStudiosIndia) October 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
టెర్మినెటర్ డార్క్ ఫేట్
హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ మరియు మళయాళ భాషలలో #TerminatorTeluguTrailer #TerminatorDarkFate pic.twitter.com/Z1zMRws7nR
">మీ స్క్వార్జ్నెగ్గర్ థియేటర్లో దద్దరిల్లే యాక్షన్ సీన్లతో అలరించడానికి నవంబరు ఒకటిన వస్తున్నాడు.
— Fox Studios India (@FoxStudiosIndia) October 16, 2019
టెర్మినెటర్ డార్క్ ఫేట్
హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ మరియు మళయాళ భాషలలో #TerminatorTeluguTrailer #TerminatorDarkFate pic.twitter.com/Z1zMRws7nRమీ స్క్వార్జ్నెగ్గర్ థియేటర్లో దద్దరిల్లే యాక్షన్ సీన్లతో అలరించడానికి నవంబరు ఒకటిన వస్తున్నాడు.
— Fox Studios India (@FoxStudiosIndia) October 16, 2019
టెర్మినెటర్ డార్క్ ఫేట్
హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ మరియు మళయాళ భాషలలో #TerminatorTeluguTrailer #TerminatorDarkFate pic.twitter.com/Z1zMRws7nR
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్వకుడు. అంతేకాకుండా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ సినిమాకు విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.