కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. జాగ్రత్త చర్యలు పాటించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ నటి, భాజపా ఎంపీ హేమమాలిని ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. ప్రతిఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. టీకా కూడా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. తాను రెండు డోసులు స్వీకరించినట్లు వెల్లడించారు.
"కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా మనమందరం టీకా వేయించుకోవాలి. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా నా నియోజకవర్గంలోని రైతులందరూ దయచేసి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి" అని అన్నారు.