ETV Bharat / sitara

'అమ్మ బాబోయ్​... దర్శకత్వం నా వల్ల కాదు!' - latest tolly wood news

టాలీవుడ్​లో​ ​ కమెడియన్​గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిషోర్​... గతంలో 'జప్ఫా' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే తాజాగా తన దర్శకత్వంలో మరో సినిమా వస్తుందా అని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

Vennela Kishore reveals  his own direction movie
అమ్మ బాబోయ్​... నా దర్శత్వంలో సినిమానా?
author img

By

Published : Apr 15, 2020, 5:13 AM IST

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్‌ వాంటెడ్‌ కమెడియన్‌గా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు వెన్నెల కిషోర్‌. అయితే కిషోర్​ ఒకవైపు నటిస్తూనే.. ఇదివరకు ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. అప్పట్లో తన దర్శకత్వ ప్రతిభను నమ్ముకొని బ్రహ్మానందంతో 'జప్ఫా' అనే హాస్య చిత్రాన్ని రూపొందించాడు. అయితే అది బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఫలితంగా అప్పటి నుంచి మళ్లీ అతడు దర్శకత్వం జోలికి వెళ్లలేదు.

తాజాగా అతడు ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "మళ్లీ దర్శకత్వం వహించే అవకాశముందా" అని విలేకరి ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. "మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో సమీప భవిష్యత్తులో మళ్లీ అలాంటి ఆలోచన చేయకూడదనుకుంటున్నా " అని సరదాగా బదులిచ్చాడు. ఇక తన తాజా చిత్రాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తన చేతిలో 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌', 'రంగ్‌ దే', 'పుష్ప'లతో పాటు చిరంజీవి తాజా చిత్రం 'ఆచార్య' కూడా ఉన్నట్లు తెలియజేశాడు. అంతేకాదు.. చిరు చిత్రంలో తన పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

ఇదీ చూడండి : పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ భామకు వరుడు కావలెను

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.