ETV Bharat / sitara

Narappa: వెంకీమామ 'నారప్ప' ట్రైలర్​ వచ్చేసింది! - అమెజాన్​ ప్రైమ్​లో నారప్ప

విక్టరీ వెంకటేశ్​ (Venkatesh) హీరోగా శ్రీకాంత్​ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నారప్ప'(Narappa). జులై 20న అమెజాన్​ ప్రైమ్​ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్​(Narappa Trailer)ను చిత్రబృందం విడుదల చేసింది.

Venkatesh's Narappa Movie Trailer Released
Narappa: వెంకీమామ 'నారప్ప' ట్రైలర్​ వచ్చేసింది!
author img

By

Published : Jul 14, 2021, 12:20 PM IST

విక్టరీ వెంకటేశ్‌(Venkatesh) కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నారప్ప'(Narappa). తమిళ సూపర్‌హిట్‌ 'అసురన్‌' రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. జులై 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా(Narappa On Amazon Prime) 'నారప్ప' స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్​ను(Narappa Trailer) చిత్రబృందం విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తొలుత థియేటర్‌లోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. దీంతో చిత్రబృందం ఓటీటీవైపే మొగ్గు చూపింది. ఈ సినిమా నుంచి తొలి లిరికల్​ సాంగ్ ఇటీవలే విడుదలైంది. 'చలాకీ చిన్మమ్మి' అంటూ సాగే తొలి లిరికల్​ సాంగ్​(Chalaki Chinnammi Song) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ గీతాన్ని ఆదిత్య అయ్యంగార్​, నూతన్​ మోహన్​ ఆలపించారు. ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి.. 'నారప్ప', 'దృశ్యం2' ఓటీటీ డీల్​ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.