ETV Bharat / sitara

Narappa: 'అలాంటి పాత్ర దక్కడం అదృష్టం'

author img

By

Published : Jul 19, 2021, 5:37 PM IST

వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన 'నారప్ప'(Narappa) చిత్రం మంగళవారం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ పలు విషయాలు పంచుకున్నారు. రీమేక్​లు సవాళ్లతో కూడుకుని ఉంటాయని తెలిపారు.

Venkatesh
వెంకటేశ్

వెంకటేశ్(Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన 'నారప్ప' మంగళవారం (జులై 20) అమెజాన్‌ ప్రైమ్‌(Narappa on Amazon Prime) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ చిత్రం 'అసురన్‌'(Asuran) రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. సినిమా విడుదల నేపథ్యంలో తాజాగా వెంకటేశ్‌ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

వెంకటేశ్ ఇంటర్వ్యూ
  • 'అసురన్‌' ఓ అద్భుతమైన కథ. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ నేను అలాంటి చిత్రాన్ని చూడలేదు. చూడగానే నాకు బాగా నచ్చిన చిత్రమిది. తప్పకుండా ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. నారప్ప లాంటి క్యారెక్టర్​ చేయడం అదృష్టమని చెప్పాలి.
  • ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లు అన్ని కూడా ఎంతో క్లిష్టమైనవి. ప్రతి యాక్షన్‌ సీక్వెన్స్‌ పూర్తైన వెంటనే నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చేది. అంతలా ఆ ఎమోషన్‌లో లీనమైపోయా. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేది. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్​ చాలా అద్భుతంగా యాక్షన్ సన్నివేశాల్ని రూపొందిచారు.
  • ఈ సినిమా కోసం 60 రోజులపాటు నిర్విరామంగా షూటింగ్ చేశాం. కొంచెం అలసటగా అనిపించినా.. చిత్రీకరణలో అడుగుపెట్టగానే ఏదో ఎనర్జీ వచ్చేది. కానీ ఆ శక్తి ఎలా వచ్చిందో తెలియదు. కొన్నిసార్లు ఇది నేను కాదు అనిపించేది. ప్రతి సాయంత్రం ఓసారి ఆలోచిస్తే ఈ యాక్షన్ సీన్ నేనెలా చేశా? ఈ సీన్ నేనే ఎలా చేశా? అనిపిస్తుంది.
  • శ్రీకాంత్‌ అడ్డాలతో కలిసి నేను 'సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు' చేశాను. ఒకానొక సమయంలో ఆయన 'అసురన్‌' చిత్రాన్ని వీక్షించారు. ఆయనకీ సినిమా బాగా నచ్చింది. రీమేక్‌ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి కనబరిచారు. అలా, ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారు. నిజం చెప్పాలంటే 'నారప్ప' తెరకెక్కించడం శ్రీకాంత్‌కు ఓ ఛాలెంజ్‌. ఆయన ఎంతో చక్కగా సినిమాని తీర్చిదిద్దారు. ఒక సినిమా విడుదలై అది ఒక బెంచ్‌మార్క్‌ క్రియేట్‌ చేసినప్పుడు అసలైన కథకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రీమేక్‌ చేయాలి. చిన్నప్ప, కార్తీక్ రత్నం చేసిన పాత్ర చాలా బాగా వచ్చింది. వారిద్దరూ క్యారెక్టర్​లో లీనమైపోయారు. అలాగే మణిశర్మ సంగీతం అద్భుతంగా ఉంటుంది. అన్ని పాటలూ బాగా కుదిరాయి.

ఇవీ చూడండి: సందీప్​ వంగా 'పవర్'​ఫుల్ మెమోరీస్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.