ETV Bharat / sitara

వెంకటేశ్, రానా దగ్గుబాటి కలయికలో వెబ్ సిరీస్?

author img

By

Published : Aug 16, 2021, 4:12 PM IST

టాలీవుడ్ అగ్రహీరో వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి ఓ మల్టీ స్టారర్ వెబ్ సిరీస్​కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్​ను పట్టాలెక్కించనుందట నెట్​ఫ్లిక్స్.

విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి వెబ్​సిరీస్

టాలీవుడ్​ అగ్ర హీరో విక్ట‌రీ వెంక‌టేశ్, రానా ద‌గ్గుబాటిలు క‌లిసి న‌టిస్తే చూడాల‌ని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బాబాయ్‌.. అబ్బాయ్ ద్వయం త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతున్నట్లు సమాచారం. దీనిని తొలుత హిందీలో తెరకెక్కించి ఇత‌ర భాష‌ల్లోకి అనువాదం చేసి విడుద‌ల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్​ను తెర‌కెక్కించనుందట. వ‌చ్చే ఏడాదిలో ఈ వెబ్ సిరీస్ చిత్రీక‌రణ మొదలుకానుందని సమాచారం.

వెంకటేశ్ ఇటీవలే 'నారప్ప' సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. అంతేగాక రాబోయే చిత్రం 'దృశ్యం-2'ని కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. 'బాహుబలి'తో రానా దగ్గుబాటి పాన్​ ఇండియా స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పవర్​ స్టార్ పవన్ కల్యాణ్​తో 'భీమ్లా నాయక్'లో నటిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.