'ఎఫ్ 2' వంటి కామెడీ హిట్‌తో ఈ ఏడాదిని హుషారుగా ఆరంభించాడు హీరో వరుణ్‌తేజ్. ఈ జోరులోనే 'వాల్మీకి'గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో పూజా హెగ్డే.. శ్రీదేవి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
వినాయక చవితితో పాటు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని రెండు కొత్త పోస్టర్లను విడుదల చేశారు. పాత కాలం నాటి గెటప్‌లో సీరియస్ లుక్‌తో వరుణ్ దర్శనమివ్వగా.. మరో లుక్‌లో పూజా హెగ్డేతో కలిసి జంటగా కనిపించాడు. ఇందులో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించబోతున్నాడు మెగాహీరో. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇవీ చూడండి.. రెట్టింపు హర్రర్‌గా 'రాజుగారి గది 3'