అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి తెలుగు చిత్రం 'అంతరిక్షం'. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం లభించింది. కానీ వరుణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలోని కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకున్నాడు మెగా ప్రిన్స్.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో కష్టమైన సన్నివేశాన్ని నెట్టింట షేర్ చేశాడు వరుణ్. స్పేస్ సూట్ వేసుకుని అంతరిక్షంలో తిరుగుతూ కనిపించే సందర్భంలో తీసిన వీడియో ఇది. దీనికి నెటిజన్లు ఈ హీరోను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">