మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందా? ఇప్పటికే ఇరువురి మధ్య కథా చర్చలు జరిగాయా? అంటే.. అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీని తర్వాత ఆయన చేయబోయే చిత్రంపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ప్రస్తుతం పలువురు దర్శకులు కథలు వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. అధికారికంగా ఏదీ ఖరారు కాలేదు.
అయితే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కథకు వరుణ్ పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెల తొలి వారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.