యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ వివాహం త్వరలో జరగబోతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మేరకు యూట్యూబ్‌లో వచ్చిన వీడియోను స్క్రీన్‌షాట్ తీసిన కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
"ఏంటి బావా(వరుణ్‌ను ఉద్దేశిస్తూ).. నీకు పెళ్లంట?" అని ఆశ్చర్యపోతున్న ఎమోజీలను షేర్ చేశారు. దీనికి వరుణ్‌తేజ్ రిప్లై ఇచ్చారు. "దానికి (వివాహానికి) చాలా సమయం ఉందిలే కానీ.. మన రానా, నితిన్ మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటామంటూనే సింపుల్‌గా సింగిల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు" అని కామెంట్ చేశారు.
-
Dhaaniki chaala time undhi le kaani, Mana @RanaDaggubati and @actor_nithiin maatram Forever with you antune simple ga SINGLE GROUP nunchi Exit aipoyaru..😏
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) May 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dhaaniki chaala time undhi le kaani, Mana @RanaDaggubati and @actor_nithiin maatram Forever with you antune simple ga SINGLE GROUP nunchi Exit aipoyaru..😏
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) May 23, 2020Dhaaniki chaala time undhi le kaani, Mana @RanaDaggubati and @actor_nithiin maatram Forever with you antune simple ga SINGLE GROUP nunchi Exit aipoyaru..😏
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) May 23, 2020
వరుణ్ ట్వీట్‌కు నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. "అది నిజమే.." అంటూ మద్దతు తెలిపారు. దీనిపై రానా, నితిన్ ఇంకా స్పందించలేదు. రానా ఈ ఏడాదిలో తన ప్రియురాలు మిహీకా బజాన్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల 'రోకా'తో వీరిద్దరి పెళ్లి సందడి మొదలైంది. డిసెంబరులోపు రానా వివాహం జరుగుతుందని ఆయన తండ్రి సురేశ్‌బాబు చెప్పారు. ఇటీవల నితిన్‌కు తన ప్రేయసి షాలినితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్‌లో దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది.
కథానాయకుడు నిఖిల్ లాక్‌డౌన్ సమయంలోనే ఓ ఇంటివారయ్యారు. తన ప్రేయసి పల్లవి వర్మను మనువాడారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తొలుత వివాహం వాయిదా వేసుకున్న నిఖిల్.. చివరికి తక్కువ మంది అతిథుల సమక్షంలో ప్రభుత్వ నిబంధల్ని పాటించి, పెళ్లి చేసుకున్నారు.