విభిన్న చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న వారిలో మెగాహీరో వరుణ్‌తేజ్ ముందున్నాడు. ఇటీవలే 'గద్దలకొండ గణేష్' అంటూ ప్రేక్షకులను పలకరించాడు. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో అలరించాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నడు. తన తర్వాత సినిమాలో బాక్సర్‌గా కనిపించనున్నాడు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ ఆలయంలో లాంఛనంగా మొదలైందీ చిత్రం. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలుకానుంది.
ఈ సందర్భంగా రెడ్ బాక్సింగ్ గ్లోవ్తో పంచ్ ఇస్తున్నట్లు ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు హీరో వరుణ్.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, నాగబాబు తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రినైజన్స్ సినిమాస్, బీడబ్ల్యూసీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇది చదవండి: బాక్సింగ్ రింగ్‌లోకి దిగబోతున్న వరుణ్