'హ్యాపీడేస్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై యువతను అమితంగా అకట్టుకున్న హీరో వరుణ్ సందేశ్. శేఖర్ కమ్ముల స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అందులో నలుగురు హీరోలు నటించగా.. వరుణ్ ఒకడు. నేడు వరుణ్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా అతని సినీ కరీర్తో పాటు వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తిక విషయాలు తెలుసుకుందాం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవడైన వరుణ్ సందేశ్ అమెరికాలో పెరిగాడు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించాడు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల హ్యాపీడేస్ కోసం ఇచ్చిన ఓ ప్రకటనని చూసి దరఖాస్తు చేసుకున్నాడు. అందులో ఎంపిక కావడం వల్ల.. 'హ్యాపీడేస్'లో కథానాయకుడిగా నటించాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందుకున్న వరుణ్ వెంట వరుసగా అవకాశాలు వరించాయి. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన 'కొత్త బంగారులోకం'తో మళ్లీ హిట్ అందుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇటువంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన వరుణ్.. ఆ తర్వాత అంతగా విజయాలను అందుకోలేకపోయాడు. మధ్యమధ్యలో 'ఏమైందీ వేళ' వంటి హిట్టు పడినప్పటికీ వరుణ్ సినీ కెరీర్ గాడిన పడలేదు. 'ఎవరైనా ఎప్పుడైనా','‘కుర్రాడు', 'మరో చరిత్ర', 'హ్యాపీ హ్యాపీగా' చిత్రాలు ఓ మోస్తరుగా ఆడాయంతే. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. 'డి ఫర్ దోపిడి', 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' చిత్రాలు కాస్త ఫర్వాలేదనిపించాయి. 2015 తర్వాత వరుణ్ నుంచి సినిమాలేవీ రాలేదు. 'పడ్డామండీ ప్రేమలో మరి' అనే చిత్రంలో తన సరసన నటించిన కథానాయిక వితిక శేరుతో ప్రేమలో పడిన వరుణ్.. ఆ తర్వాత ఆమెని వివాహం చేసుకొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">