'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', 'బద్లాపూర్' చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ధావన్ మరికొన్ని గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ను వరుణ్ ఆదివారం పరిణయమాడనున్నారు. ముంబయికు సమీపంలోని అలీబాగ్‌లోని అతిపెద్ద హోటల్.. 'ది మ్యాన్షన్ హౌస్'లో వీరి వివాహం జరుగనుంది. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఆరోగ్య పరిస్థితుల రీత్యా.. అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో రెండు రోజులుగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
![Varun Dhawan weeding celebrations pics goes viral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10361261_1.jpg)
వివాహ వేడుకల్లో వరుణ్‌ధావన్
వివాహ వేడుకల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం మెహందీ, రాత్రి సంగీత్ కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ వీణ, సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్ర ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్, కరణ్‌జోహార్ సైతం ఈ వివాహ సమయానికి ఇక్కడికి చేరుకోనున్నట్లు సమాచారం.
![Varun Dhawan weeding celebrations pics goes viral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10361261_2.jpg)
![Varun Dhawan weeding celebrations pics goes viral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10361261_3.jpg)
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: విడుదలకు సిద్ధమైన కొత్త సినిమాలివే!