కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు సెలిబ్రిటీలు తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ కరోనాపై ఓ ర్యాప్ సాంగ్‌ను రూపొందించాడు. దీనిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు.
ప్రధానమంత్రి మోదీ కరోనా గురించి ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మాటలతో ఈ వీడియో ప్రారంభమైంది. ఇందులో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన 'దేవదాస్'కు సంబంధించిన సన్నివేశాలతో పాటు లాక్డౌన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు వరుణ్. అలాగే సంగీత దర్శకుడు తనీషా బాగ్చీకి కృతజ్ఞతలు చెప్పాడు. ఈ వీడియో షేర్ చేయగానే అభిమానుల నుంచి ప్రశంసలు దక్కాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">