ETV Bharat / sitara

'సున్ సాథియా' పాటకు వరుణ్, కియరా ప్రాక్టీస్ చూసేయండి! - కియారా అడ్వాణీ తాజా వార్తలు

వరుణ్ ధావన్, కియరా అడ్వాణీ జంటగా నటించిన చిత్రం 'ఏబీసీడీ 2'. ఈ సినిమాలోని పాటలు ఎంతగానో అలరించాయి. అయితే ఇందులోని 'సున్​ సాథియా' అనే పాటకు సంబంధించిన రిహార్సల్స్ వీడియోను తాజాగా నెట్టింట పంచుకున్నాడు వరుణ్.

వరుణ్
వరుణ్
author img

By

Published : May 27, 2020, 4:27 PM IST

వరుణ్​ ధావన్, కియరా అడ్వాణీ జంటగా నటించిన చిత్రం 'ఏబీసీడీ 2'. డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించింది. ఇందులోని పాటలు ప్రేక్షకులను అలరించాయి. అందులో 'సున్ సాథియా' అనే పాట ఒకటి. తాజాగా ఈ పాటకు రిహార్సల్స్ చేస్తోన్న సమయంలోని వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు వరుణ్.

ఈ పాట మ్యూజిక్​తో పాటు డ్యాన్స్​ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. మరి అలాంటి ఔట్​పుట్ రావడానికి వరుణ్-కియరా కూడా అంతే కష్టపడ్డారు. ఈ వీడియో చూస్తే అది అర్థమవుతోంది. అలాగే వీరిమధ్య కెమిస్ట్రీ కనులవిందుగా ఉంది.

ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా సినీతారలంతా ఇంటికే పరిమితమయ్యారు. వరుణ్ కూడా ఇంటివద్దే కాలక్షేపం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు.

  • ట" class="align-text-top noRightClick twitterSection" data="ట">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.