ETV Bharat / sitara

'వరుడు కావలెను' ట్రైలర్.. సాంగ్​తో 'రౌడీ బాయ్స్'

author img

By

Published : Oct 20, 2021, 8:41 PM IST

టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'వరుడు కావలెను', 'హీరో', 'సమ్మతమే', 'రౌడీ బాయ్స్'​ చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

Varudu Kavalenu
వరుడు కావలెను

నాగశార్య, రీతూవర్మ జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu). ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న ఈ చిత్ర యూనిట్ ట్రైలర్​ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. గురువారం రాత్రి 7 గంటలకు ఈ ప్రచార చిత్రాన్ని నటుడు దగ్గుబాటి రానా రిలీజ్ చేయనున్నారని వెల్లడించింది.

Varudu Kavalenu
వరుడు కావలెను

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడైన శిరీష్‌ తనయుడు ఆశీష్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'రౌడీబాయ్స్'(rowdy boys movie)​. 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని 'ప్రేమే ఆకాశం' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్​ను జస్​ప్రీత్ జజ్ ఆలపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యువహీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం 'సమ్మతమే'. 'లవ్ ఈజ్ అన్​ కండీషనల్' అనే ట్యాగ్​లైన్​ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాందిని చౌదరి హీరోయిన్​గా చేస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్​ను గురువారం ఉదయం 10.10 గంటలకు విడుదల చేయనున్నారు.

అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి సాంగ్​ను అక్టోబర్ 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

hero
హీరో

ఇవీ చూడండి: సొగసైన భామలు.. సోషల్ మెరుపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.