ETV Bharat / sitara

'వకీల్​సాబ్' సక్సెస్​మీట్.. టపాసులతో సెలబ్రేషన్

author img

By

Published : Apr 9, 2021, 6:56 PM IST

పవన్ 'వకీల్​సాబ్' ప్రేక్షకాదరణ పొందుతుండటంపై దర్శక నిర్మాతలు వేణుశ్రీరామ్, దిల్​రాజు ఆనందం వ్యక్తం చేశారు. టాపాసులు కాల్చి సందడి చేశారు.

vakeel-saab-success-meet-celebration
'వకీల్​సాబ్' సక్సెస్​మీట్.. టపాసులతో సెలబ్రేషన్

నిస్సహాయ స్థితిలో న్యాయం కోసం పోరాటం చేస్తున్న ముగ్గురు యువతులకు న్యాయవాది సత్యదేవ్ ఎలా అండగా నిలిచారనే కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా 'వకీల్​సాబ్'. పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రల్లో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శుక్రవారం(ఏప్రిల్ 9) విడుదలైన ఈ చిత్రం.. అన్ని కేంద్రాల్లో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా 'వకీల్​సాబ్'​ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శక నిర్మాతలు దిల్ రాజు, వేణుశ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు.

వకీల్​సాబ్ విజయంపై దర్శకనిర్మాతలు ఆనందం

సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ నిర్మించిన తమ చిత్రానికి ఘన విజయం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. తన సంస్థకు మంచి సినిమాను అందించిన దర్శకుడు వేణుశ్రీరామ్​ను నిర్మాత దిల్​రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం చిత్ర బృందంతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు.

vakeel saab success meet
బాణాసంచా కాల్చి వకీల్​సాబ్ టీమ్ సెలబ్రేషన్స్

ఇది చదవండి: సమీక్ష: పవన్ 'వకీల్​సాబ్ 'ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.