ETV Bharat / sitara

పవన్​ ఫ్యాన్స్​కు శుభవార్త.. 'వకీల్​సాబ్​' నుంచి సర్​ప్రైజ్​! - పవన్​కల్యాణ్​ వకీల్​సాబ్

మూడేళ్ల తర్వాత పవర్​స్టార్​ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం 'వకీల్​సాబ్​'.. అటు థియేటర్లలో సత్తా చాటడం సహా ఇటు ఓటీటీ ప్రేక్షకులనూ మెప్పించింది. ఈ సినిమాలోని తమన్​ కంపోజ్​ చేసిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర నేపథ్య సంగీతానికి సంబంధించిన ఒరిజినల్​ ట్రాక్​ను రిలీజ్​ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Vakeel Saab Original Background Score To Be Released Soon
పవన్​ ఫ్యాన్స్​కు శుభవార్త.. 'వకీల్​సాబ్​' నుంచి సర్​ప్రైజ్​!
author img

By

Published : May 18, 2021, 8:05 PM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం 'వకీల్​సాబ్'. దాదాపు మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్​ ఈ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర తన పవరేంటో మరోసారి చూపించాడు. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఇటీవలే ఓటీటీలోనూ విడుదలై కూడా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో పవర్​స్టార్​ అభిమానుల కోసం సినిమా నుంచి మరో సర్​ప్రైజ్​ను చిత్రబృందం ప్లాన్​ చేయనుందట.

'వకీల్​సాబ్' ఒరిజినల్​ నేపథ్య సంగీతాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎస్​ఎస్​ థమన్​ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్ర బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ కోసం ​ఎంతోమంది సంగీత ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా బ్యాక్​గ్రౌండ్​ సంగీతాన్ని రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

దిల్​రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్​ కల్యాణ్​తో పాటు నివేదా థామస్​, అంజలి, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషించారు. ఇందులో పవన్​ సరసన శ్రుతిహాసన్​ నటించింది.

ఇదీ చూడండి.. "పాగల్​' చూడాలంటే టీవీలు, ఫోన్లు సరిపోవు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.