ETV Bharat / sitara

'అలా అడగలేను.. నాకు చాలా సిగ్గు' - వైష్ణవ్ తేజ్ కొండపొలం రివ్యూ

యువ హీరో వైష్ణవ్ తేజ్(vaishnav tej kondapolam), రకుల్​ప్రీత్ ప్రధానపాత్రల్లో క్రిష్ తెరకెక్కించిన చిత్రం 'కొండపొలం'. నేడు (అక్టోబర్ 8) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించిన వైష్ణవ్(vaishnav tej interview) పలు విషయాలు వెల్లడించారు.

vaishnav Tej
వైష్ణవ్
author img

By

Published : Oct 8, 2021, 6:52 AM IST

"అడవిలో చిత్రీకరణ తొలి రెండు మూడు రోజులు కష్టంగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైంది. అడవి వ్యక్తిగతంగా నాకూ చాలా విషయాల్ని నేర్పించింది" అంటున్నారు యువ కథానాయకుడు వైష్ణవ్‌తేజ్‌(vaishnav tej kondapolam). చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన ఈయన తొలి చిత్రం 'ఉప్పెన'తోనే విజయాన్ని అందుకున్నారు. రెండో చిత్రంగా 'కొండపొలం' చేశారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం నేడు (అక్టోబర్ 8) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వైష్ణవ్‌(vaishnav tej interview) గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

"తొలి సినిమా 'ఉప్పెన'(uppena movie)లో మత్స్యకార కుటుంబానికి చెందిన కుర్రాడిగా కనిపించా. ఇందులో చదువుకుని గొర్రెల్ని కాయడం కోసం వెళ్లిన కుర్రాడిగా కనిపిస్తా. రెండూ సహజమైన పాత్రలే. అయితే కేవలం ఇలాంటి పాత్రలే చేయాలనే నియమంతో నేనేమీ కథల్ని ఎంచుకోలేదు. 'రంగస్థలం'(rangasthalam movie) నుంచి మన సినిమాల గమనం మారిపోయింది. కథ, పాత్రల రీత్యానే తెరపై కనిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గిరిసాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా రొమాంటిక్‌ కామెడీ కథతో తెరకెక్కుతోంది. ఆ కథకి తగ్గట్టుగానే అందులో క్లాస్‌ కుర్రాడిగా కనిపిస్తా. ఫక్తు వాణిజ్యాంశాలున్న కథ 'కొండపొలం'(kondapolam movie). ఇంట్లో నేనెవరినీ సలహాలు అడగలేదు. మా ఇంట్లో అంత మంది కథానాయకులు ఉన్నా.. వాళ్లందరినీ స్టార్లుగానే చూసే నేను, 'ఇలా ఓ సినిమా చేస్తున్నా, ఎలా నటించాలి’'అని వాళ్లని అడగలేను. ఆ విషయంలో నాకు చాలా సిగ్గు (నవ్వుతూ). అందుకే దర్శకుడి ఆలోచనలకి అనుగుణంగానే నటిస్తుంటా."

vaishnav Tej
వైష్ణవ్ తేజ్

"కొండపొలం(kondapolam movie) అనే మాటనే చాలా మంది విని ఉండరు. ఆ అంశమే కొత్తగా అనిపించింది. అలాగే పులి, ఆ నేపథ్యంలో ఫాంటసీ.. ఇలా అన్నీ ఆసక్తికరంగా అనిపించాయి. ఇలాంటి కొత్త కథని చెప్పాల్సిందే అని మేమంతా కలిసి ఈ సినిమా చేశాం. మొదట దర్శకుడు క్రిష్‌(krish jagarlamudi new movie) ఫోన్‌ చేసినప్పుడు సినిమా కోసం కాదేమో, ఊరికే రమ్మన్నారేమో అనుకున్నా. కానీ సినిమా కథ చెప్పారు. 'హరి హర వీర మల్లు' తర్వాత ఉంటుందేమో అనుకుంటే, వెంటనే ప్రారంభిస్తున్నాం అన్నారు. నేను ఊహించని అవకాశం ఇది. చాలా సంతోషంగా అనిపించింది. క్రిష్‌ తీసిన 'గమ్యం', 'వేదం'.. ఇలా ఆయన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం."

"అప్పటికి నా తొలి చిత్రం 'ఉప్పెన' కూడా విడుదల కాలేదు. అప్పుడే రెండో సినిమా కోసం రంగంలోకి దిగా. కరోనాతో చాలా రోజులు ఇంట్లో గడిపాక ఈ సినిమా కోసం మేం బయటికి అడుగుపెట్టాం. అందుకే ఇది నా తొలి సినిమానా రెండో సినిమానా అనే విషయం కూడా గుర్తుకు రాలేదు. అడవిలో ఆ ఎండలకి మాస్క్‌ పెట్టుకుని గడపడం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అడవి ఎవరికైనా చాలా నేర్పుతుంది. మనం చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదనే విషయం అడవిలో గడుపుతున్నప్పుడు మరింత బాగా అర్థమైంది. గొర్రెల కాపర్లు ఎక్కువగా గొంగళి వేసుకుంటుంటారు. దాన్ని ఎలా వాడాలో నేర్చుకున్నా. అలాగే తలపొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు నడుస్తుంటాయి, వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని తెలిసి వాటికి రుచి చూపిస్తూ మేం చిత్రీకరణని పూర్తిచేశాం."

"ఏమీ లేని స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగే కుర్రాడి కథ. అడవితోనూ, అడవిలాంటి అమ్మాయితోనూ ప్రేమలో పడిన ఓ కుర్రాడిగా కనిపిస్తా. ఇందులో పులి పాత్ర కీలకం. దాన్ని ఊహించుకుంటూ నటించాల్సి వచ్చింది. యాస కూడా పూర్తిస్థాయిలో మాట్లాడాను. తొలి సినిమాలో ఎక్కువగా కొత్తవాళ్లే. ఇందులో మాత్రం సీనియర్లతో కలిసి పనిచేశా. ఆ క్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నా. 'రిపబ్లిక్'(republic movie)లో మా అన్న సాయితేజ్‌(sai dharam tej health) ఐఏఎస్‌ అధికారిగా కనిపించారు. 'కొండపొలం'లో నేను ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా కనిపిస్తా. మా అన్న కోలుకుంటున్నారు. ఫిజియోథెరపీ జరుగుతోంది. తొందర్లోనే బయటికొస్తారు".

"తొలి సినిమా 'ఉప్పెన'(uppena movie) విజయం తర్వాత వచ్చిన ఈ గుర్తింపు, ఈ ఇమేజ్‌ నాకే కొత్తగా, వింతగా అనిపిస్తోంది. మా మావయ్య, అన్నయ్యలకి ఇమేజ్‌ రావడం చూశా. కానీ ఇలాంటి ఓ గుర్తింపు నాకూ వస్తుందని అనుకోలేదు. వస్తే ఎలా మసలుకోవాలో కూడా ఆలోచించలేదు. బయటికెళ్లినప్పుడు అందరూ నన్ను చూశారంటే నాకే సిగ్గుగా ఉంటుంది".

ఇవీ చూడండి: హీరోయిన్ కాజల్​ నుంచి గుడ్​న్యూస్.. దాని గురించేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.