హీరో విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజన్ కాంబోలో విడుదలైన 'మాస్టర్' సినిమా అభిమానులను అలరించింది. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో 'వాతి కమింగ్' పాట.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరినీ ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సాంగ్ యూట్యూబ్‌లో 200మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">

జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న మలయాళ చిత్రం 'మరక్కర్'.. ఈ ఏడాది ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మోహన్‌లాల్ ప్రధానపాత్ర పోషించారు. ఆంటోనీ పెరంబూర్ నిర్మాతగా.. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రామా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రం 'లూసిఫర్'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని సాధించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. అంటోనీ పెరంబూర్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా 'బ్రో డాడీ' అనే టైటిల్ ఖరారు చేశారు. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందనున్న రెండో చిత్రమిది. ఇందులో మోహన్‌లాల్‌తో పాటు మీనా, పృథ్వీరాజ్, కల్యాణి ప్రియదర్శన్ కీలకపాత్రలు పోషించనున్నారు.

ఇదీ చూడండి.. KGF 2: 'కేజీఎఫ్ 2' విడుదలపై క్లారిటీ!